Site icon NTV Telugu

Trump-Musk: మరింత ఉధృతం అవుతున్న ట్రంప్-మస్క్ వివాదం.. టెస్లా అధినేతకు వార్నింగ్

Musk

Musk

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ను మొదటి నుంచి మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతరం రాజీ కుదిరిందో.. ఏమో తెలియదు గానీ.. పోస్టులపై మస్క్ క్షమాపణ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగిందని వార్తలు వినిపించాయి.

ఇది కూడా చదవండి: Bhopal: భోపాల్‌లో దారుణం.. ప్రియురాలిని చంపి.. స్నేహితుడితో మందు పార్టీ.. చివరికిలా..!

తాజాగా సెనెట్‌లో బిల్లు ఆమోదం పొందింది. ఉత్కంఠగా సాగిన ఓటింగ్‌లో 51-49 తేడాతో బిల్లు ఆమోదం లభించింది. అయితే సెనెట్‌లో బిల్లు ఆమోదం పొందడంపై మస్క్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ఓటు వేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తల దించుకోవాలి!,’’ అని ఎక్స్‌లో మస్క్ విమర్శించారు. అంతటితో ఆగకుండా అమెరికా చట్ట సభల్లో బిల్లు ఆమోదం పొందితే మరుసటి రోజే కొత్త పార్టీ స్థాపిస్తానంటూ మస్క్ హెచ్చరించారు.

తాజాగా మస్క్ చేసిన విమర్శలకు ట్రంప్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. మానవ చరిత్రలో ఎవరూ పొందనంత రాయితీలను ఎలాన్‌ మస్క్‌ తీసుకొంటున్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ అవి లేకపోతే అతడు దుకాణం మూసుకుని వెళ్లాల్సిందేనని ట్రంప్ ధ్వజమెత్తారు. కొన్నాళ్ల క్రితం వరకు అధ్యక్షుడిగా తనకు బలమైన మద్దతు ఇచ్చాడన్నారు. విద్యుత్ వాహనాలను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తున్న విషయం మస్క్‌ కూడా తెలుసన్నారు. ఇప్పటివరకు మానవ చరిత్రలో ఎవరూ పొందనంత సబ్సిడీని ఎలాన్‌ అందుకొన్నారు. ఆ రాయితీలే లేకపోతే.. దుకాణం సర్దుకుని దక్షిణాఫ్రికాలోని ఇంటికి పోవాల్సి వచ్చేదేని చెప్పారు. ఇకపై రాకెట్‌, ఉపగ్రహ ప్రయోగాలు, ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తులు ఉండవన్నారు. డబ్బు ఆదా కోసం డోజ్‌ పరిశీలించాలని.. అలా చేస్తే పెద్ద మొత్తం ఆదా అవుతుందని సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు.

Exit mobile version