రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు చెరిగారు. పుతిన్ ఉద్దేశమేంటో అర్థమవుతోందని.. పగలు చాలా అందంగా మాట్లాడతాడని. రాత్రయితే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతాడని… అలాంటి ప్రవర్తన తనకు నచ్చట్లేదని ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Hyderabad: కల్లు దుకాణంలో కల్లు సేవించిన భార్యాభర్తలకు అస్వస్థత
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సౌదీ అరేబియా వేదికగా ఇరు పక్షాలు చర్చలు కూడా జరిపారు. అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఓ వైపు చర్చలు జరుపుతూనే.. ఇంకోవైపు బాంబు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను పుతిన్ తోసిపుచ్చారు. దీంతో ఆగ్రహించిన ట్రంప్.. పుతిన్‌పై మండిపడ్డారు. తీవ్ర అసంతృప్తికి గురైన ట్రంప్.. మాస్కోపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Pooja Hegde : పూజా హెగ్డేకు బిగ్ ఛాన్స్ – టాలీవుడ్‌లో గ్రాండ్ రీ ఎంట్రీ ఖాయం
పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కీవ్‌కు పంపించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు చాలా అత్యవసరమని అన్నారు. ఎన్ని ఆయుధాలను పంపిస్తామన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఇటీవలే ఉక్రెయిన్‌కు ఆయుధాలు నిలిపేస్తామని ట్రంప్ ప్రకటించారు. కానీ పుతిన్ మాట వినకపోవడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఉక్రెయిన్‌కు రక్షణాత్మక ఆయుధ వ్యవస్థలను అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఆయుధాలను ఉచితంగా ఇవ్వబోమని తేల్చిచెప్పారు.
రష్యాపై కఠిన ఆంక్షలు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. దీనిపై ఏం చేద్దామో సోమవారం చూద్దాం అని అన్నారు. ఇక మాస్కోపై కఠినమైన ఆంక్షల కోసం ద్వైపాక్షిక బిల్లును యూఎస్ సెనెటర్లు సిద్ధం చేసినట్లు సమాచారం. రష్యాతో సత్సంబంధాలు కలిగిన దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించేలా ఈ బిల్లును రూపొందించినట్లు రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్ తెలిపారు.
