Site icon NTV Telugu

Green Card : భారతీయులకు శుభవార్త.. జో బైడన్‌ కీలక నిర్ణయం..

Jeo Biden

Jeo Biden

అమెరికాలో గ్రీన్‌ కార్డు సంపాదించాలంటే మామూలు విషయం కాదు. దానికి సంబంధించిన ప్రాసెస్‌ అంతా అయేసరికి మన తల ప్రాణం తోకకు వస్తుంది. అంతేకాకుండా.. ఇప్పటికే అమెరికానే నివసిస్తున్న వారు.. అక్కడి పౌరసత్వం కోసం ఎంతగానే ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ శుభవార్త చెప్పారు. గ్రీన్ కార్డ్‌లు, శాశ్వత నివాసం కోసం దరఖాస్తులు చేసుకున్న వారి అప్లికేషన్లను ఆరు నెలల్లో ప్రాసెస్ పూర్తి చేయాలని జో బైడన్‌ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ నిర్ణయానికి జో బైడెన్ యంత్రాంగం ఏకగ్రీవంగా ఓటు వేయడం విశేషం.

దశాబ్దాలుగా గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న దాదాపు 10 వేల మంది భారతీయులకు ఇది ఊరట కలిగించే విషయం. ప్రముఖ భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా దీనికి సంబంధించి ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ సమయంలో దాని 25 మంది కమీషనర్లు దీనిని ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే.. ఇక నుంచి గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆరు నెలల లోపే న్యాయనిర్ణేత నిర్ణయాలను జారీ చేయడంపై వివరాలు అందుతాయి.

అంతేకాకుండా.. వలసదారులు దేశంలో ఉండడానికి, పని చేయడానికి సులభతరం చేసే లక్ష్యంతో, యూఎస్‌సీఐఎస్‌ వర్క్ పర్మిట్‌లు, ప్రయాణ పత్రాలు, తాత్కాలిక స్థితి పొడిగింపుల కోసం అభ్యర్థనలను మూడు నెలల్లో సమీక్షించాలని,నిర్ణయాలను నిర్ధారించాలని కమిషన్ సిఫార్సు చేసింది. సంవత్సరానికి 2,26,000 గ్రీన్ కార్డ్‌లలో 2021 ఆర్థిక సంవత్సరంలో కేవలం 65,452 ఫ్యామిలీ ప్రిఫరెన్స్ గ్రీన్ కార్డ్‌లు మాత్రమే జారీ చేశారు. దీంతో వేలల్లో గ్రీన్ కార్డ్‌ల దరఖాస్తులు మూలనపడ్డాయి. కాబట్టి.. ఆ సమస్య రాకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నారు.

 

Exit mobile version