Green Card : భారతీయులకు శుభవార్త.. జో బైడన్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో గ్రీన్ కార్డు సంపాదించాలంటే మామూలు విషయం కాదు. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా అయేసరికి మన తల ప్రాణం తోకకు వస్తుంది. అంతేకాకుండా.. ఇప్పటికే అమెరికానే నివసిస్తున్న వారు.. అక్కడి పౌరసత్వం కోసం ఎంతగానే ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ శుభవార్త చెప్పారు. గ్రీన్ కార్డ్‌లు, శాశ్వత నివాసం కోసం దరఖాస్తులు చేసుకున్న వారి అప్లికేషన్లను ఆరు నెలల్లో ప్రాసెస్ పూర్తి చేయాలని జో బైడన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ నిర్ణయానికి జో బైడెన్ యంత్రాంగం ఏకగ్రీవంగా ఓటు వేయడం విశేషం.
దశాబ్దాలుగా గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న దాదాపు 10 వేల మంది భారతీయులకు ఇది ఊరట కలిగించే విషయం. ప్రముఖ భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా దీనికి సంబంధించి ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ సమయంలో దాని 25 మంది కమీషనర్లు దీనిని ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే.. ఇక నుంచి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆరు నెలల లోపే న్యాయనిర్ణేత నిర్ణయాలను జారీ చేయడంపై వివరాలు అందుతాయి.
Also Read
- Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
- Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
- America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
అంతేకాకుండా.. వలసదారులు దేశంలో ఉండడానికి, పని చేయడానికి సులభతరం చేసే లక్ష్యంతో, యూఎస్‌సీఐఎస్ వర్క్ పర్మిట్‌లు, ప్రయాణ పత్రాలు, తాత్కాలిక స్థితి పొడిగింపుల కోసం అభ్యర్థనలను మూడు నెలల్లో సమీక్షించాలని,నిర్ణయాలను నిర్ధారించాలని కమిషన్ సిఫార్సు చేసింది. సంవత్సరానికి 2,26,000 గ్రీన్ కార్డ్‌లలో 2021 ఆర్థిక సంవత్సరంలో కేవలం 65,452 ఫ్యామిలీ ప్రిఫరెన్స్ గ్రీన్ కార్డ్‌లు మాత్రమే జారీ చేశారు. దీంతో వేలల్లో గ్రీన్ కార్డ్‌ల దరఖాస్తులు మూలనపడ్డాయి. కాబట్టి.. ఆ సమస్య రాకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్‌గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!