Site icon NTV Telugu

Trump Gold Card: త్వరలో ట్రంప్ కార్డ్.. గోల్డ్‌ కార్డు వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు

Trump

Trump

Trump Gold Card: అగ్రరాజ్యం అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 ప్లేస్ లో గోల్డ్‌ కార్డు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. 5 మిలియన్‌ డాలర్లు ‌(రూ.44 కోట్లు) చెల్లించిన వారికి నేరుగా యూఎస్ పౌరసత్వాన్ని అందజేయనున్నారు. తాజాగా ఈ గోల్డ్‌ కార్డుకు సంబంధించి వెబ్‌సైట్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించారు. 5 మిలియన్ డాలర్లకు, ట్రంప్ కార్డ్ రానుందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. యూఎస్ పౌరసత్వాన్ని కొనుగోలు చేసేందుకు అనేక మంది కాల్ చేసి.. ఎలా నమోదు చేసుకోవాలని అడుగుతున్నారు.. అయితే, ఈ గోల్డ్‌ కార్డ్‌ ఇంకా కొనుగోలుకు అందుబాటులోకి రాలేదు అన్నారు. కాగా, ప్రస్తుతం వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవడానికి మాత్రమే అందుబాటులో ఉంది.. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ కార్డు లేదా గోల్డ్ కార్డు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారు Trumpcard.gov అనే వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వారి పేరు, ప్రాంతం, ఈ-మెయిల్ సహా ఇతర వివరాలను రిజిస్ట్రర్ చేయాల్సి ఉంటుంది.

Read Also: Iran-Israel: కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఏదైనా జరిగితే అమెరికాదే బాధ్యత అన్న ఇరాన్

కాగా, పౌర‌స‌త్వ కార్డులతో వేగంగా జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొంత మేర త‌గ్గించ‌ వ‌చ్చు అనే అభిప్రాయంలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈ క్రమంలో ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా స్థానంలో దీన్ని తీసుకు వస్తున్నారు. అయితే, ఈబీ-5 ప్రోగ్రామ్ ద్వారా యూఎస్ లో పెట్టుబ‌డి పెట్టే విదేశీయుల‌కు గ్రీన్ కార్డు అందజేస్తారు.. ఇక, ఈ గోల్డ్ కార్డుల అమ్మకంతో తమ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పర్చచాలని అగ్రరాజ్యం అధ్యక్షుడు అనుకుంటున్నారు. అర్హత కలిగిన విదేశీయులకు ఈ కార్డులను అమ్మడంతో ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు . ఈ ట్రంప్ కార్డు వెంటనే అమెరికా పౌరసత్వాన్ని కల్పించక పోయినప్పటికీ.. దాన్ని పొందేందుకు రూట్ ని క్లియర్ చేస్తున్నారు.

Exit mobile version