Site icon NTV Telugu

Trump: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలను ఆవిష్కరించిన ట్రంప్

Trump1

Trump1

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పేరు మీద ఉన్న ‘ట్రంప్-క్లాస్’ యుద్ధ నౌకలను ఆవిష్కరించారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలుగా పేర్కొన్నారు. ఈ నౌకలు అమెరికా నావికా ఆధిపత్యాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద యుద్ధనౌకలుగా వెల్లడించారు.

ఫ్లోరిడాలోని ట్రంప్ మార్-ఎ-లాగో నివాసం నుంచి నౌకలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, నేవీ కార్యదర్శి జాన్ ఫెలాన్ ఉన్నారు. నౌకల చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ఈ నౌకలు 30,000 నుంచి 40,000 టన్నుల బరువును స్థానభ్రంశం చేస్తాయని.. క్షిపణులు, తుపాకులు, లేజర్‌లు, హైపర్‌సోనిక్ క్షిపణులతో సహా ఇంకా అధునాతన ఆయుధాలను కలిగి ఉంటాయని ట్రంప్ అన్నారు. మొదట్లో రెండు నౌకలను ప్లాన్ చేస్తున్నారని.. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెపపారు. ఇవి అత్యంత ప్రాణాంతకమైన యుద్ధ నౌకలుగా చెప్పారు.

ఈ యుద్ధ నౌకలు ఐయోవా తరగతి నౌకలు కంటే 100 రెట్లు శక్తివంతమైనవి. బీజింగ్‌కు ధీటుగా ఈ యుద్ధ నౌకలు నిర్మించాలని అమెరికా నావికాదళం భావించింది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈ నౌకలు నిర్మిస్తున్నారు. ఇక విక్రేత విషయంలో 2030లో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం అమెరికానే ఫస్ట్.. ఆ తర్వాతే ఇతర దేశాలకు విక్రయించనున్నారు.

Exit mobile version