NTV Telugu Site icon

Suchir Balaji: అమెరికా పోలీసులు సంచలన నిర్ణయం.. సుచిర్ బాలాజీ కేసు మూసివేత

Suchir Balaji

Suchir Balaji

చాట్‌జీపీటీ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ (26) కేసును అమెరికా పోలీసులు క్లోజ్ చేశారు. సుచిర్ బాలాజీది హత్య కాదని.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో అనేక వారాల దర్యాప్తు తర్వాత పోలీసులు కేసును మూసివేస్తున్నట్లు వెల్లడించారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: NTR – Neel : సలార్, కేజీఎఫ్‌ రూట్ లోనే ఎన్టీఆర్ – నీల్ సినిమా.?

2024, నవంబర్ 26న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్‌లో బాలాజీ విగతజీవిగా పడి ఉన్నాడు. హఠాత్తుగా బాలాజీ ప్రాణాలు కోల్పోవడం టెక్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. అయితే పోలీసులు.. బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చి చేతులు దులుపుకున్నారు. బాలాజీ తల్లిదండ్రులు మాత్రం.. తన కుమారుడిది ముమ్మాటికీ హత్యేనని.. నిగ్గు తేల్చాలని భారత విదేశాంగ శాఖను, అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎలోన్ మస్క్‌ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక విజ్ఞప్తి చేసి.. బాలాజీ మరణంపై దర్యాప్తు చేయాలని కోరారు. మొత్తానికి కొన్ని వారాలు తర్వాత ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లుగా శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Gold Price: మరోమారు దూకుడు చూపిస్తున్న బంగారం ధరలు..

సుచిర్‌ బాలాజీ.. నాలుగేళ్ల పాటు ఓపెన్‌ ఏఐలో పరిశోధకుడిగా పనిచేశారు. గత ఆగస్టులో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఓపెన్‌ ఏఐతో లాభం కంటే.. హానికరమే ఎక్కువ అని పేర్కొ్న్నారు. అంతేకాకుండా చాట్‌జీపీటీ కాపీరైట్‌ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్‌జీపీటీ, ఇతర చాట్‌బాట్‌లు ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక 2022లో కాపీరైట్‌ ఉల్లంఘనలకు సంబంధించి అనేక పిటిషన్లు ‘ఓపెన్‌ఏఐ’పై దాఖలయ్యాయి. ఈ కేసుల్లో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో అతడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది.