Site icon NTV Telugu

US: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే ఛాన్స్.. అమెరికా హై అలర్ట్

Us

Us

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా హై అలర్ట్ చేసింది. ప్రస్తుతం ఇరాన్ అణ్వాయుధం కోసం పని చేస్తోంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్, టెహ్రాన్, టెల్ అవీవ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసేందుకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇరాక్‌లోని అణు కేంద్రాల్లో ఉన్న సిబ్బందిని విడిచి వెళ్లేందుకు విదేశాంగ అనుమతి ఇచ్చింది. పెంటగాన్ సైనిక కుటుంబాలు యూఎస్ స్థావరాల నుంచి స్వచ్ఛందంగా విడిచిపెట్టి వెళ్లేందుకు అనుమతిచ్చింది.

ఇది కూడా చదవండి: Midhun Reddy: లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కీలక విచారణ..!

అమెరికా అనుమతి లేకుండానే ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది. అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యగా అమెరికా ఆస్తులపై నాశనం చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడి చేస్తే దానికి అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే టెహ్రాన్ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Laya : నా సొంతింటికి తిరిగి వచ్చినట్లు ఉంది..

అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ కోరారు. కానీ అందుకు ఇరాన్ నిరాకరించింది. అయితే అణు కార్యక్రమం విఫలమైతే ఇరాన్‌పై దాడి చేస్తామని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా బుధవారం ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణు ఒప్పందానికి సిద్ధంగా లేదని అర్థమవుతుందని వ్యా్ఖ్యానించారు. ఇక ఇరాన్‌పై దాడులు జరిగితే ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలుపై దాడులు జరిగే అవకాశం ఉంటుందని.. ముందుగానే ఆ స్థావరాలు ఖాళీ చేయాలని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇజ్రాయెల్ దాడులు చేస్తే.. దానికి ప్రతీకారంగా అమెరికాపైనే దాడులు చేస్తామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదే బుధవారం అన్నారు.

Exit mobile version