US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
- యూఎస్ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి షాకింగ్ ఫలితాలు..
- రిపబ్లికన్ పార్టీపై డెమోక్రాట్లు ఆధిక్యం సంపాదిస్తే ట్రంప్‌కు కష్టాలు..
- ట్రంప్ అధికారాలపై ఆంక్షలు, అభిశంసన ముప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ పార్టీ రిపబ్లికన్లు చాలా చోట్ల వెనుకంజలో ఉన్నారు. మరోవైపు, డెమోక్రాట్లు సత్తా చాటుతున్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలైతే ట్రంప్ అధ్యక్ష పదవికి ఎసరు పెట్టే అవకాశం ఉంది. అయితే, రాబోయే రెండేళ్లు మాత్రం ఆయనకు కష్టకాలంగా మారుతుంది. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు మెజారిటీ లభిస్తే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు, అధికారుల జవాబుదారీతనం, అభిశంసన ప్రక్రియకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది.
డెమోక్రాట్ల ఆధిప్యతం పెరిగితే ఏం అవుతుంది.?
అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనెట్‌లోని మూడోంతుల సీట్లకు ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని 100 స్థానాల్లో 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు 36 రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Also Read
- US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం..
- Iran Threatens Trump: 'మేం ట్రంప్‌ను చంపేస్తాం..' ఇరాన్లో భారీ భారీ హోర్డింగ్ కలకలం..
- Donald Trump: ఆర్థిక సాయం బంద్.. ఇజ్రాయిల్‌కు ట్రంప్ షాక్!
- US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు మెజారిటీ లభిస్తే కీలక పార్లమెంటరీ కమిటీలపై వారి నియంత్రణ పెరుగుతుంది. దీంతో ట్రంప్ పరిపాలన తీసుకున్న నిర్ణయాలపై విచారణలు చేపట్టడం, ప్రభుత్వ అధికారుల్ని ప్రశ్నించడం మొదలవుతుంది. దీంతో ట్రంప్‌పై ప్రతిపక్ష డెమోక్రాట్ల నుంచి ఒత్తిడి తీవ్రం అవుతుంది. కాంగ్రెస్‌లో మెజారిటీ కోల్పోయినంత మాత్రాన అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారులు రద్దు కావు. ట్రంప్ తన పరిధిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేసే అధికారాన్ని కొనసాగిస్తారు.
అభిశంసన ప్రక్రియకు అవకాశం..
డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో మెజారిటీ సాధిస్తే ట్రంప్‌పై అభిశంసలన ప్రక్రియకు సంబంధించిన చర్చలు మొదలువుతాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానాన్ని ప్రతినిధుల సభ ఆమోదించవచ్చు. దీనికి సాధారణ మెజారిటీ సరిపోతుంది.అయితే, అభిశంసన ద్వారా ట్రంప్‌ను వెంటనే పదవి నుంచి తొలగించడం వీలు కాదు. ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సెనెట్‌లో విచారణ జరుగుతుంది. అధ్యక్షుడు తప్పు చేస్తున్నాడని, ఆయనను తొలగించాలంటే నేట్‌లో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. అందువల్ల డెమోక్రాట్లు అభిశంసన ప్రక్రియను ప్రారంభించినా, ట్రంప్‌ను పదవి నుంచి తొలగించడం అంత సులభం కాదు.
ఇరాన్ యుద్ధం, ఎలాన్ మస్క్ కంపెనీలపై విచారణ..
ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న వేళ దీనిపై ట్రంప్ ప్రశ్నల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. డెమోక్రాట్లు యుద్ధం నిర్ణయాలు, సైనిక వ్యయం, రక్షణ బడ్జెట్‌పై ప్రశ్నల్ని లేవనెత్తే అవకాశం ఉంటుంది. యుద్ధ నిధులపై చర్చలు, వివాదాలు తలెత్తవచ్చు. అయినప్పటికీ రిపబ్లికన్లు ఓడిపోయినంత మాత్రాన యుద్ధానికి సంబంధించిన నిధులు ఆటోమేటిక్‌గా నిలిచిపోవు. విదేశాంగ విధానం, సైనిక చర్యలకు సంబంధించిన అధికారాలు ట్రంప్ వద్దే ఉంటాయి.
మధ్యంతర ఎన్నికల ఫలితాలు వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆయన కంపెనీలపై ప్రభావం పడుతుంది. ట్రంప్‌కు సంబంధించిన వ్యాపార ప్రయోజనాలు, ప్రభుత్వ కాంట్రాక్టులపై డెమోక్రాట్లు దృష్టి సారిస్తారు. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల ప్రభుత్వ లావాదేవీలు, నియంత్రణ సంబంధిత అంశాలపై విచారణ జరపాలనే డిమాండ్లు రావచ్చు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
-
Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
-
Anil Ambani Group: అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ భారీ చర్యలు.. రూ.510 కోట్ల ఆస్తులు అటాచ్, చార్టర్డ్ విమానాలు స్వాధీనం
-
Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం..
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!