Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Update Today: మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
మురసు తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇవాళ సెలవు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దనే సురక్షితంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు వర్షాల ప్రభావంతో కాకినాడ జిల్లాలోనూ కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు.
Also Read
- US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం..
- AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
- Iran Threatens Trump: 'మేం ట్రంప్‌ను చంపేస్తాం..' ఇరాన్లో భారీ భారీ హోర్డింగ్ కలకలం..
- IND vs NZ 1st ODI: నేడే భారత్ vs న్యూజిలాండ్ వన్డే.. రో-కో ఎంట్రీపై జోష్.. సిరాజ్ భుజాలపై కీలక బాధ్యతలు..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం..
-
Hero Xpulse 450: హీరో Xpulse 450 ఆవిష్కరణ.. 421cc ఇంజిన్‌తో పాటు Android Auto, Apple CarPlay సపోర్ట్
-
Iran Threatens Trump: ‘మేం ట్రంప్‌ను చంపేస్తాం..’ ఇరాన్లో భారీ భారీ హోర్డింగ్ కలకలం..
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!