Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..

  • గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు..
  • అమెరికా స్థావరాలే లక్ష్యంగా బహ్రైయిన్‌పై ఇరాన్ దాడులు..
Iran War

Iran War

Iran War:  ఓవైపు శాంతి చర్చలు జరుగుతుంటే, మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ శనివారం అమెరికా స్థావరాలే లక్ష్యంగా బహ్రైయిన్‌పై దాడులు చేసింది. ఇదే సమయంలో హార్ముజ్‌లోని ఒక నౌకపై కూడా దాడి జరిగింది. అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అమెరికా రాత్రిపూట జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడులు చేసింది.

గురువారం హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా వైమానిక దాడులు చేసింది. బహ్రైయిన్ యూఎస్ నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయానికి కేంద్రంగా ఉంది. ఇటీవల గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) విదేశాంగ మంత్రుల సమావేశం కోసం యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో బహ్రైయిన్‌కు వచ్చారు. ఇరాన్ దాడులు నిలిపేసి, హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచాలని సమావేశం పిలుపునిచ్చింది.