US-Iran War: ఇరాన్‌కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
- ఇరాన్‌కు అమెరికా 5 కఠిన షరతులు..
- అణు కార్యక్రమాలే టార్గెట్‌గా యూఎస్ ప్లాన్స్..
- యురేనియాన్ని అప్పగించాలని డిమాండ్..
- ఈ షరతుల కారణంగానే చర్చల్లో ప్రతిష్టంభన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరోసారి తీవ్రతరం అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నా్యి. ఈవారంలో అమెరికా, ఇజ్రాయిల్ కలిసి దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికన్ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను నియంత్రించేందుకు అమెరికా కఠినమైన 5 షరతులను విధించినట్లు ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ షరతుల కారణంగానే ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ అణు కార్యక్రమాలను కట్టడి చేసేందుకు అమెరికా షరతులు విధించింది. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల ఎన్రిచ్డ్ యురేనియాన్ని తమకు అప్పగించాలని యూఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదే కాకుండా ఇరాన్ అణు కార్యక్రమాలనున నిలిపేయాలని కోరింది. గతంలో ఆంక్షల కారణంగా జరిగిన ఆర్థిక నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించబోమని అమెరికా స్పష్టం చేసింది. విదేశాల్లో నిలిపేసిన ఇరాన్ నిధుల్లో 25 శాతం మాత్రమే విడుదల చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాన్ అన్ని షరతులకు ఒక వేళ అంగీకరించిన సైనిక ఒత్తిడి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
Also Read
ఇదే సమయంలో ఇరాన్ కూడా అమెరికాకు 5 షరతులు పెట్టింది. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధాన్ని ముగించాలని, ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని, విదేశాల్లో ఉన్న ఇరాన్ నిధుల్ని విడుదల చేయాలని కోరింది. ఇదే కాకండా యుద్ధాల వల్ల తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో అమెరికా మరోసారి దాడికి దిగితే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!