Donald Trump: ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా నిధుల దుర్వినియోగం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు 21 మిలియన్ డాలర్లను యూఎస్ఎయిడ్ ద్వారా అందించినట్లు ఇటీవల ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా, USAID ద్వారా దక్షిణాసియాకు పంపిన నిధులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. వైట్ హౌస్‌లో గవర్నర్ వర్కింగ్ సెషన్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, బంగ్లాదేశ్‌కు USAID $29 మిలియన్ల నిధుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిధులను ‘‘ఎవరికి తెలియని సంస్థ’’కు ఇచ్చారని అన్నారు.
Read Also: US deports Indians: అక్రమ వలసదారుల బహిష్కరణ.. ఇండియా చేరిన 4వ బ్యాచ్..
హసీనాకు వ్యతిరేకంగా నిధులు వాడారా..?
గతేడాది ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ముసుగులో షేక్ హసీనాను అధికారంలో నుంచి దించారు. ఆమె భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత అమెరికా డీప్ స్టేట్‌తో సంబంధాలు ఉన్న మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ దేశాధినేతగా అయ్యారు. అయితే, ప్రస్తుతం ట్రంప్ ఆరోపిస్తున్న ఈ నిధులను షేక్ హసీనాకు వ్యతిరేకంగా వాడారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
నిజానికి ఈ మొత్తం వ్యూహంలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి కూడా సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఐఎస్ఐతో సంబంధం ఉన్న జమాతే ఇస్లామీ సంస్థ ప్రస్తుతం మహ్మద్ యూనస్‌కి గట్టి మద్దతుదారుగా ఉంది. షేక్ హసీనా పతనం తర్వాత బంగ్లాదేశ్‌ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన ఉంది. అయితే, ఈ పరిణామాలను ట్రంప్ లేదా భారత్ సహిస్తుందా.? అనేది తేలాల్సి ఉంది.
బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఐఎస్ఐ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. భారత్-బంగ్లా సంబంధాలు దిగజారిన పరిస్థితుల్లో, ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిమ్ మాలిక్ నేతృత్వంలోని ఐఎస్ఐ బృందం బంగ్లాదేశ్‌ని సందర్శించింది. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్, ఉఖియా, టెక్నాఫ్, మౌల్వి జజార్, హబీ గంజ్, షేర్పూర్ ప్రాంతాలను సందర్శించారు.