ట్రంప్ హెచ్చరించినట్లుగానే గ్రీన్‌లాండ్‌లో ఉద్రిక్తతలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. అమెరికా సైన్యం గ్రీన్‌లాండ్ దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పిటుఫిక్ స్పేస్ బేస్ నుంచి అమెరికా సైనిక చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అమెరికా అంతరిక్ష దళానికి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే ట్రంప్ హెచ్చరికలతో అమెరికా దళం దూకుడుగా వెళ్తున్నట్లు సమాచారం.
తాజా ఆపరేషన్‌లో 150 మంది యూఎస్ ఎయిర్‌పోర్స్, స్పేస్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (NORAD) ఒక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే తమ సైనిక విమానం పిటుఫిక్ స్పేస్ బేస్‌కు చేరుకుంటుందని వెల్లడించింది. డెన్మార్క్ సమన్వయంతోనే ఈ కార్యకలాపాలు జరిగాయని, గ్రీన్‌లాండ్ ప్రభుత్వానికి ముందుగానే సమాచారం అందించామని యూఎస్ సైన్యం తెలిపింది. అయితే అమెరికా సైన్యం ప్రకటనపై ఇంకా డెన్మార్క్ స్పందించలేదు.
