Site icon NTV Telugu

US-Iran Tension: “ఇజ్రాయిల్ వదిలి వెళ్లండి”.. ఇరాన్ ఉద్రిక్తతల మధ్య అమెరికా హెచ్చరిక..

Us Iran Tensions

Us Iran Tensions

US-Iran Tension: మిడిల్ ఈస్ట్‌లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయిల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకబీ శుక్రవారం రాయబార కార్యాలయ సిబ్బందితో మాట్లాడుతూ.. ‘‘మీరు ఇజ్రాయిల్ వదిలి వెళ్లాలనుకుంటే ఈరోజే వదిలి వెళ్లండి’’ అని అన్నారు. ఉదయం 10.24 గంటలకు యూఎస్ రాయబార ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో.. ‘‘ప్రస్తుతానికి భయపడాల్సిన పనిలేదు, కానీ వెళ్లాలనుకునే వారు వీలైనంత త్వరగా విమానాలు బుక్ చేసుకోవడం మంచిది’’ అని పేర్కొన్నారు.

Read Also: Vijay: “విజయ్‌కు ఎఫైర్ ఉంది”.. విడాకులు కోరిన దళపతి భార్య

అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తుందనే వాదనలు బలపడ్డాయి. ఒక వేళ ఇరాన్‌పై దాడి జరిగితే, ఈ ప్రాంతంలోని అమెరిక స్థావరాలపై ఇరాన్ దాడులకు తెగబడే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్‌లోని పలు సైనిక స్థావరాల్లో దాదాపుగా 10 వేల మంది యూఎస్ సైనికులు ఉన్నారు. మరోవైపు, యూఎస్ ఇరాన్ మధ్య అణు చర్చలు అసంపూర్తిగా పూర్తవ్వడంతో అమెరికా దాడి చేసే అవకాశాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తూ.. 15 రోజుల్లో డీల్‌కు రావాలని ఇరాన్‌ను హెచ్చరించారు.

Exit mobile version