US-Iran War: సొంత రెస్క్యూ విమానాలను కూల్చిన అమెరికా.. కారణం ఏమిటంటే..?

  • సొంత యుద్ధవిమానాలను పేల్చేసిన యూఎస్..
  • ఇరాన్‌లో పైలట్ రెస్క్యూ సమయంలో ఘటన..
  • ఎందుకు పేల్చేసిందని అందరిలో ఆసక్తి..
Us Iran War (2)

Us Iran War (2)

US-Iran War:  ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ పైలట్‌ను అమెరికా బలగాలు విజయవంతంగా రెస్క్యూ చేశాయి. రెండు రోజుల క్రితం ఇరాన్ అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను కూల్చేసింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా విమానం నుంచి బయటపడ్డాడు. ఇలా బయటకి వచ్చిన పైలట్‌ను రక్షించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అయితే, ఈ ఆపరేషన్‌లో అమెరికా సైన్యం తన సొంత యుద్ధ విమానాలను పేల్చేసింది.

Read Also: Basara Temple : బాసర టెంపుల్ నమూనా.. మీరు చూశారా.?

ఇలా సొంత విమానాలను అమెరికా ఎందుకు పేల్చేసిందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఆపరేషన్‌లో ఉపయోగించిన రెండు ఎంసీ-130జే కమాండో-2 ట్రాన్స్‌పోర్ట్ విమానాలు పేల్చేసింది. ఆపరేషన్ సమయంలో ఇందులో సమస్యలు ఏర్పడటం, శత్రు ప్రాంతంలో చిక్కుకుపోవడం, తిరిగి తీసుకురావడం అసాధ్యంగా మారడంతో అమెరికా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. శత్రు దేశాల చేతుల్లో తమ టెక్నాలజీ చేరకుండా ఉండటానికి ఇలా పేల్చేసింది. కమ్యూనికేషన్స్, నావిగేషన్ సిస్టమ్స్, స్పెషల్ ఆపరేషన్ టెక్నాలజీ వంటికి ఇరాన్‌కు చేరితే ప్రమాదకరమని యూఎస్ భావించింది.

ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్ సమయంలో అనేక అమెరికా విమానాలు ధ్వంసమైనట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్జీసీ) తెలిపింది. అమెరికాకు చెందిన సీ-130 ట్రాన్స్‌పోర్ట్ విమానం దక్షిణ ఇస్ఫహాన్‌లో కూల్చేసినట్లు చెప్పింది. దీంతో పాటు రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది.ఇదిలా ఉంటే, ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ గాలిబాఫ్ ఇన్‌స్టాలో ధ్వంసమైన యూఎస్ విమానాలను పోస్ట్ చేసి, అమెరికాకు ఇలాంటి మరో మూడు జరిగితే నాశనమవ్వడం ఖామయని ట్వీట్ చేశారు.