Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Us Declares Monkeypox A Public Health Emergency

Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించిన బైడెన్‌ సర్కార్‌

Published Date :August 5, 2022 , 12:23 pm
By Mahesh Jakki
Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించిన బైడెన్‌ సర్కార్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Monkeypox: ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ఇంకా కరోనా సమస్య తొలగిపోకముందే ఈ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో రోజురోజుకూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మహమ్మారిపై పోరాటం కోసం ఎక్కువ నిధులు కేటాయించడమే గాక, సమాచార సేకరణ కోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకుని ప్రజలు తమకు సహకరించాలని అమెరికా ఆరోగ్య శాఖ కోరింది. “ఈ మంకీపాక్స్ వైరస్‌ను పరిష్కరించడంలో మా ప్రతిస్పందనను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మంకీపాక్స్‌ను తీవ్రంగా పరిగణించాలని, ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో మాకు సహాయపడటానికి బాధ్యత వహించాలని మేము ప్రతి అమెరికన్‌ను కోరుతున్నాము” అని అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి జేవియర్ బెకెరా తెలిపారు.

Covid Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

మంకీపాక్స్ నియంత్రణకు తాను కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. టీకా పంపిణీ వేగవంతం చేసి పరీక్షల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. ఈ వైరస్‌ వల్ల ముప్పును ప్రజలకు తెలియజేస్తామన్నారు. అందుకే మంకీపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు తెలిపారు. వైరస్‌పై పోరాటంలో ఇది చాలా కీలకమన్నారు. అమెరికాలో సుమారు 6600 కేసులు న‌మోదు అయ్యాయి. దీంట్లో మూడో వంతు కేసులు న్యూయార్క్‌లో బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ రాష్ట్రం సొంతంగా ఎమ‌ర్జెన్సీ ప్రక‌టించుకుంది. కాలిఫోర్నియా, ఇలియాస్‌లోనూ అధిక కేసులు న‌మోదు అయ్యాయి. ఈ ఏడాది ప్రపంచ‌వ్యాప్తంగా 26వేల కేసులు న‌మోదు అయిన‌ట్లు అమెరికా అంటువ్యాధుల సంస్థ సీడీసీ చెప్పింది. యూఎస్‌లో 99 శాతం కేసులు ఇప్పటివరకు పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులలో ఉన్నాయని ఆరోగ్య, మానవ సేవల విభాగం గత వారం తెలిపింది ఈ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • monkeypox
  • monkeypox cases
  • monkeypox in us
  • Monkeypox Public Health Emergency

తాజావార్తలు

  • Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions