NTV Telugu Site icon

26/11 Mumbai Terror Attacks: ముంబై దాడుల నిందితుడిని భారత్‌కు అప్పగించనున్న అమెరికా .. 30 రోజుల్లో కోర్టు నిర్ణయం

Mumbai Attacks

Mumbai Attacks

26/11 Mumbai Terror Attacks: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడిని అమెరికా, భారత్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా కోర్టు 30 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. 2008లో లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా వ్యక్తి తహవుర్ రాణా కీలక నిందితుడి ఉన్నాడు. ఇతడిపై అమెరికా న్యాయస్థానం విచారణ చేస్తోంది. ప్రస్తుతం జైలులో ఉన్న వ్యాపారవేత్త తహవుర్ రాణా దాఖలు చేసిన స్టేటస్ కాన్ఫరెన్స్ మోషన్‌ను అమెరికా న్యాయస్థానం కొట్టేసింది.

స్టేటస్ కాన్ఫరెన్స్ మోషన్‌ అంటే..?

స్టేట్స్ కాన్ఫరెన్స్ రిజల్యూషన్ అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ. దీని ద్వారా న్యాయస్థానం ప్రాసిక్యూషన్, డిఫెన్స్ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి రెండు వైపులా రాజీ చేసేందుకు ప్రయత్నిస్తుంది. చాలా కాలంగా ఈ కేసులో విచారణ జరగకపోవడంతో తహవూర్ రాణా తరుపు న్యాయవాది గత నెలలో ఈ ప్రతిపాదన చేశారు. ఆ అంశంపై చివరిసారిగా 21 జైలై 2021న జరిగిందని రాణా తరుపు న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు. నిందితుడు చాలా రోజులుగా జైలులో ఉన్నందుకు ఇరు పార్టీలు కలిసి కేసు తాజా స్థితి చర్చించాలని కోరారు. అయితే ప్రస్తుతం దీన్ని అమెరికా కోర్టు కొట్టేసింది. 30 రోజుల్లో కోర్టు నిందితుడు రాణాను భారత్ కు అప్పగించడంపై నిర్ణయం తీసుకోనుంది.

Read Also: IPL 2023 : చెలరేగిపోతున్న ఆర్సీబీ బ్యాటర్లు.. వరుస వికెట్లు తీస్తున్న పంజాబ్ బౌలర్లు

ఉగ్రదాడిలో హెడ్లీకి సహకరించిన రాణా..

తహవుర్ రాణాకు ముంబై అటాక్స్ కేసులో ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చిన్ననాటి మిత్రుడు. లష్కరేతోయిబా ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఈ దాడులకు రాణా, హెడ్లీకి సహాయం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొటన్నారు. ముంబై ఉగ్రదాడులకు హెడ్లీ ప్లాన్ చేసిన విషయం రాణాకు తెలుసు. ఉగ్రదాడిలో రాణా కూడా భాగమే అని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. రాణాను భారత్ కు అప్పగించాలని కోర్టులో తెలిపింది. అయితే దీన్ని అతడి న్యాయవాది వ్యతిరేకిస్తున్నారు. 2008లో లష్కరేతోయిబా చేసిన ఉగ్రదాదిలో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు సముద్రం ద్వారా ముంబైకి చేరుకుని నరమేధం సృష్టించారు. తాజ్, ఓబెరాయ్, నారీమన్ హౌజ్, సీఎస్టీ రైల్వేస్టేషన్లలో దాడులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడుల్లో ఆరుగులు అమెరికా పౌరులతో పాటు 166 మందిని చంపారు. దుబాయ్ లో రాణా, హెడ్లీ కలిసే ముంబై దాడులకు కుట్ర పన్నినట్లు తేలింది.