Site icon NTV Telugu

Taiwan: తైవాన్‌పై దాడికి చైనా, రష్యా మిలిటరీలు కలిసి పనిచేస్తున్నాయి: అమెరికా.

Taiwan

Taiwan

Taiwan: తైవాన్‌పై దండయాత్ర చేయాలని గత కొన్ని రోజులుగా చైనా ప్రయత్నిస్తోంది. తైవాన్‌ని భయపెట్టేందుకు క్రమంగా చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీతో తైవాన్‌ని కవ్విస్తోంది. ముఖ్యంగా చైనా నౌకలు, యుద్ధవిమానాలు తైవాన్ సరిహద్దుల్ని అతిక్రమిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా సంచలన విషయాన్ని చెప్పింది. తైవాన్‌‌ని స్వాధీనం చేసుకోవడంతో పాటు సైనిక సమస్యలపై రష్యా, చూనాలు సన్నిహితంగా పనిచేస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదానైనా ఎదుర్కొనేందుకు రెండు దేశాలు సమన్వయంతో కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నాయని అమెరికా పేర్కొంది.

Read Also: Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై విచారణ జరపాలని సీఐడీకి ఈసీ ఆదేశం

‘‘మేము చైనా, రష్యాలు మొదటిసారిగా తైవాన్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజ్ చేయడం, తైవాన్ విషయంలో రష్యా వారితో కలిసి పనిచేయాలని చైనా ఖచ్చితంగా కోరుకుంటోందని గుర్తించాం. వారు ఎందుకు చేయకూడదనే కారణం మాకు కనిపించడం లేదు’’ అని ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అవ్రిల్ హైన్స్ గురువారం కాంగ్రెస్‌కు సాక్ష్యంగా చెప్పారు. రష్యా, చైనాలు ఖచ్చితంగా సహకరించే వాతావరణంలో పనిచేయడం ఆందోళన కలిగివే విషయమని లెఫ్టినెంట్ జనరల్ జెఫ్రీ క్రూస్ వెల్లడించారు. ఈ రెండు దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచుకుంటున్నాయని హెయిన్స్ చెప్పారు.

Exit mobile version