NTV Telugu Site icon

US-Syria: సిరియాపై అమెరికా బాంబుల వర్షం.. ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా భీకరదాడి

Ussyria

Ussyria

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో అగ్ర రాజ్యం అమెరికా కూడా సిరియాపై విరుచుకుపడింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా వరుసగా గగనతల దాడులకు తెగబడింది. శుక్రవారం నుంచి పలుమార్లు దాడి చేసినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు దాని మిత్రదేశాలపై ఐసిస్‌ దాడులు చేసేందుకు కుట్ర పన్నిందన్న కచ్చితమైన సమాచారంతో అమెరికా ముందస్తు దాడులకు దిగింది.

ఇది కూడా చదవండి: Coriander benefits: కొత్తిమీరతో బీపీ, డయాబెటిస్‌ కంట్రోల్!

సిరియాలోని సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అమెరికా తెలిపింది. ఇటీవల కాలంలో కూడా పలుమార్లు అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించింది. వారంతా ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌, అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారేనని తెలిపింది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. తాజా దాడులతో ఐసిస్‌ శక్తిసామర్థ్యాలు దెబ్బతిన్నట్లు అమెరికా ప్రకటించింది. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే, మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేవారిని సహించబోమని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Liquor : విస్కీ, బీరు కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

ఇప్పటికే హమాస్-హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గాజా, లెబనాన్‌ను ధ్వంసం చేసింది. ఇరాన్‌పై కూడా దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్‌ రంగాలపై అమెరికా తన ఆంక్షలను విస్తరించింది. ఇటీవల ఇజ్రాయెల్‌పై బాలస్టిక్‌ క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడింది. దాడులకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంకోవైపు అమెరికా మిత్రదేశాలకు కూడా ఇరాన్‌ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి.

ఇది కూడా చదవండి: Ram Charna: అలియా భట్ కూతురి కోసం రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం