NTV Telugu Site icon

US arrests Pakistani: డొనాల్డ్ ట్రంప్‌ సహా మరికొందరి హత్యకు ప్లాన్ చేసిన పాకిస్థానీ..

Us

Us

US arrests Pakistani: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా మరి కొందరు రాజకీయ నాయకులను చంపి వేసేందుకు ఓ పాకిస్థానీ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. నిందితుడికి ఇరాన్‌తో కూడా మంచి సంబంధాలున్నాయని గుర్తించింది. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ క్రిస్టఫర్‌వ్రే పేర్కొన్నారు. ఇరాన్‌ చేయించే కిరాయి హత్య కుట్రగా దీనిని అభివర్ణించారు. ఈ కేసులో పాకిస్థాన్‌కు చెందిన 46 ఏళ్ల ఆసీఫ్‌ మర్చెంట్‌ అమెరికన్లను చంపేందుకు సుపారీ తీసుకునేందుకు ట్రై చేస్తుండగా అమెరికా అధికారులు న్యూయార్క్‌లో అతడ్ని అరెస్టు చేశారు. నిందితుడి టార్గెట్లలో డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఉన్నట్లు సదరు అధికారులు గుర్తించారు.

Read Also: Serena Williams-Restaurant: పారిస్ రెస్టరెంట్‌లో సెరెనాకు అవమానం.. వివరణ ఇచ్చిన మేనేజ్‌మెంట్!

కాగా, ఈ కేసులో అరెస్టైన ఆసీఫ్‌ మర్చెంట్‌ ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ నుంచి అమెరికాకు వచ్చాడు. అప్పటికే అతడు కొంతకాలం ఇరాన్‌లో జీవనం కొనసాగించినట్లు పేర్కొన్నారు. అతడి అక్కడే ఓ ఫ్యామిలీ ఉండగా.. అమెరికాకు చేరుకోగానే కిరాయి గుండాలను ఏర్పాటు చేయడంలో హెల్ప్ చేస్తాడని భావించిన ఓ వ్యక్తితో కుట్రపై చర్చించాడు. కానీ, సదరు వ్యక్తే పోలీసులకు సమాచారం అందించారు. వాస్తవానికి ఆ కిరాయి హంతకుడి రూపంలో ఉన్న వ్యక్తి అండర్‌కవర్‌ అధికారిగా సమాచారం.

Read Also: Wayanad: రాజంటే ప్రభాసే.. కేరళకు కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన ‘కర్ణ’..

ఇక, సదరు అండర్‌కవర్‌ అధికారి ఆసీఫ్‌ను జూన్‌లో కొందరు వ్యక్తుల సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా, హత్యలు మొదలు కావడానికి ముందే తాను అమెరికాను నుంచి వెళ్లిపోతానని ఆసీఫ్ మర్చెంట్‌ పేర్కొన్నాడని.. ఆ తర్వాత భద్రతలో ఉండే వ్యక్తులను చంపడం గురించి వారికి తెలియజేశాడు. ఇక, ఆ తర్వాత మరో నెల రోజుల తర్వాత కిరాయి హంతకుడి రూపంలోని ఎఫ్‌బీఐ ఏజెంట్‌ను కలిసి.. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఓ రాజకీయ నేతను హత్య చేసేందుకు 5,000 డాలర్లు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. జులై 12న అమెరికాను వీడేందుకు ట్రై చేస్తుండగా.. అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Devara Controversy : అనిరుధ్.. నా పాట కాపీ చేసినందుకు సంతోషంగా ఉంది..?

అలాగే, పాకిస్థాన్‌, ఇస్లాం దేశాలకు హాని చేసే అమెరికాకు చెందిన వ్యక్తులను అంతం చేయడం టార్గెట్ గా పెట్టుకున్నట్లు విచారణలో ఆసీఫ్ మార్చంట్ ఒప్పుకున్నాడు. వీరిలో ప్రముఖుల పేర్లు ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈనేపథ్యంలో పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్‌ హత్యాయత్నానికి మర్చెంట్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే యాంగిల్ లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసును బ్రూక్లిన్‌ న్యాయస్థానం విచారణ చేస్తుంది.

Show comments