US Approves Sale Of F-16 Fleet To Pakistan: అమెరికా, పాకిస్తాన్ దేశాల మధ్య మరోసారి సైనిక బంధం బలపడుతోంది. నాలుగేళ్ల తరువాతా అమెరికా, పాకిస్తాన్ దేశానికి భద్రత సహాయం చేయనుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ కు సహాయపడేందుకు అమెరికా 450 మిలియన్ డాలర్ల ఎఫ్-16 ఫైటర్ జెట్ ప్లీట్ ను అమ్మనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి ప్రెసిడెంట్ బైడెన్ పరిపాలన యంత్రాంగం ఆమోదించింది. 2018లో ఆఫ్ఘన్ తాలిబన్లను, హక్కానీ నెట్ వర్క్ ను అణచివేయడంతో పాకిస్తాన్ ఉదాసీనత చూపించడంతో అమెరికా అందిస్తున్న 2 బిలియన్ డాలర్ల భద్రతా సాయాన్ని నిలిపివేసింది. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరించారు. అమెరికా నుంచి పాకిస్తాన్ కు అందుతున్న సాయాన్ని నిలిపివేశాడు.
Read Also: Woman Killed By Grandson: సినిమా స్ఫూర్తితో.. నానమ్మను కిరాతకంగా చంపిన మనవడు
యూఎస్ కాంగ్రెస్ బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్టేట్ డిపార్ట్మెంట్ 450 మిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో ఎఫ్-16 ఫైటర్ జెట్లను అమ్మడానికి ఆమోదించినట్లు తెలిపింది. పాకిస్తాన్ ముఖ్యమైన ఉగ్రవాద నిరోధక భాగస్వామిగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రస్తుతం ఎఫ్-16లను పాకిస్తాన్ నేవీ దళం నిర్వహిస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు వీటిని పాకిస్తాన్ కు అమెరికా అమ్ముతున్నట్లు చెబుతోంది. ప్రస్తుత అమ్మదలిచిన ఎఫ్-16లతో ఉగ్రవాద గ్రూపులపై పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ విక్రయంలో కేవలం ఎఫ్-16 మాత్రమే అమెరికా అమ్ముతోంది. దీంట్లో ఆయుధాలు లేవు.
గతంలో పాకిస్తాన్ కు అమెరికా అందించిన ఎఫ్-16 విమానాలను మిస్ యూజ్ చేసింది. భారత్, పాకిస్తాన్ లో ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఎఫ్-16 విమానాలు ఇండియాపై దాడి చేసేందుకు వచ్చాయి. ఆ సమయంలో అభినందన్ వర్థమాన్ తన మిగ్ బైసన్ విమానంతో పాకిస్తాన్ కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చేసింది. ఈ ఘటనపై అప్పట్లో అమెరికా, పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.