గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు అమెరికా ప్రత్యేక సందేశాన్ని పంపించింది. రిపబ్లిక్ డే సందర్భంగా భారతీయులకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ, ఇంధనం, ఖనిజాలు, సాంకేతిక రంగాల్లో అమెరికా-భారతదేశం లోతైన, బహుముఖ సహకారన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి వచ్చినందుకు జరుపుకుంటున్న రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Trump-Canada: ట్రంప్ వార్నింగ్ ఎఫెక్ట్.. చైనాతో వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకున్న కెనడా!
‘‘అమెరికా ప్రజల తరపున.. మీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ‘‘యునైటెడ్ స్టేట్స్-భారతదేశం చారిత్రాత్మక సంబంధాన్ని పంచుకుంటున్నాయి. రక్షణ, శక్తి, కీలకమైన ఖనిజాలు, సాంకేతిక సహకారం. రాబోయే సంవత్సరాల్లో మా భాగస్వామ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పని చేయాలని నేను ఎదురుచూస్తున్నాను.’’ అని రూబియో పేర్కొన్నారు. అమెరికా-భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధం వివిధ రంగాల్లో సన్నిహిత సహకారం ద్వారా నిజమైన ఫలితాలను ఇస్తుందని ఆకాంక్షించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ సహకారం ఉంటుందని వెల్లడించారు.
భారతదేశం సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గ్రాండ్ కవాతు జరగనుంది. ఈ వేడుకలకు అతిథులుగా యూరోపియన్ నాయకులు హాజరుకానున్నారు. ప్రస్తుతం భారతదేశం-యూరోపియన్ దేశాలతో సంబంధాలు బలపడుతున్నాయి.
