Suella Braverman: బ్రిటిష్ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అక్కడ ‘‘గ్రూమింగ్ గ్యాంగులు’’ రెచ్చిపోతున్నాయి. టీనేజ్ అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్న గ్యాంగులను అణిచివేస్తానని గతేడాది జరిగిన ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ప్రధాన హమీల్లో ఒకటిగా ఉంది. తాజాగా బ్రిటన్ హోం మినిస్టర్ సువెల్ల బ్రావెర్ మాన్ ఇంగ్లీష్ అమ్మాయిలపై వేధింపుకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా పాకిస్తాన్ సంతతికి చెందినవారు బ్రిటిష్ అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. యూకేలో అమ్మాయిలపై అత్యాచారాలు, వేధింపులు, డ్రగ్స్ కు బానిస చేస్తున్నవారిలో అధికంగా పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటిష్ వ్యక్తులు ఉంటున్నారని అన్నారు. వేలాది పిల్లల బాల్యాన్ని దోచుకుంటూ, నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నేరస్తులను గుర్తించి కనికరం లేకుండా గుర్తించి శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. యూకేలో గ్రూమింగ్ ముఠాలు బలవంతంగా, భయపెట్టి పిల్లలను లైంగికంగా దోపిడీ చేస్తున్నాయి. ఇలాంటి ముఠాలు బలహీనంగా ఉన్న పిల్లలను టార్గెట్ చేస్తుంటాయి. గ్రూమింగ్ ముఠాలు మన దేశానికి మచ్చ అని సువెల్ల బ్రావెర్ మాన్ అన్నారు.
Read Also: Harish Rao: పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్
అమ్మాయిలపై జరిగే వేధింపులను తగ్గించే చర్యల అమల్లోకి తెచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొంతకాలంగా విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. గతంలో స్వతంత్ర దర్యాప్తు విభాగం ఐఐసీఎస్ఏ చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుని కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. లైంగిక వేధింపుల నమోదును చట్టబద్ధం చేసింది. వీటి ప్రకారం చిన్నారులు రక్షణ విభాగాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు నుంచి ఫిర్యాదు అందిన వెంటనే నమోదు చేయాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
భారత విదేశీ గూఢచార సంస్థ మాజీ అధిపది విక్రమ్ సూద్ ప్రకారం.. 1997 నుంచి యూకేలో బాలలపై వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. 2014 వరకు దాదాపుగా 1400 ముస్లిమేతర బ్రిటన్ అమ్మాయిలపై పాకిస్తానీ సంతతికి చెందిన వ్యక్తులే క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. జాత్యాహంకారం, ఇంటర్ కమ్యూనిటీ సంబంధాలను దెబ్బతిస్తున్నారనే ఆరోపణలు వస్తాయనే భయంతో అక్కడి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
