Site icon NTV Telugu

Zelenskyy: అలా చేస్తేనే.. మేం కాల్పుల విరమణకు ఒప్పుకుంటాం..

Zelansky

Zelansky

Zelenskyy: దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు. అటు కీవ్‌ సైనికులు కూడా రష్యా దూకుడును ఎదుర్కోలేక దేశం వదిలి పారిపోతున్నారు. ఈ పరిణామాల వేళ కాగా, బ్రిటన్‌ మీడియా సంస్థ ‘స్కై న్యూస్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. కీవ్‌ అధీనంలో ఉన్న భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకుంటే యుద్ధాన్ని ముగించే అవకాశం ఉందన్నారు.

Read Also: Computer Keyboard: అసలు కీబోర్డ్‌లో కీస్ ఎందుకు ఆల్ఫబెటికల్ ఆర్డర్‌లో ఉండవో మీకు తెలుసా..?

ఇక, ఉక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇస్తే.. అప్పుడే మేం కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం మా దేశాన్ని (రష్యా ఆక్రమిత భూభాగం) నాటోలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. అలా జరిగితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని దౌత్యపరంగా సాధించుకునే వీలు మాకు దొరుకుతుందన్నారు. తన సూచనను పరిగణలోకి తీసుకోవడం కష్టమైన పని అని నాకు తెలుసని వ్లోదిమిర్ జెలెన్ స్కీ పేర్కొన్నారు.

Read Also: Amaran Movie Meets Rajnath Singh: కేంద్రమంత్రిని కలిసిన అమరన్ మూవీ టీమ్.. అభినందల వెల్లువ

అయితే, ఇప్పటి వరకు నాటోలోని ఏ దేశం కూడా తమకు ఈ విధమైన హామీ ఇవ్వలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వాపోయాడు. మమ్మల్ని ఎప్పటికైనా నాటోలో చేర్చుకుంటారా అనేది అనుమానమే.. ఇప్పటి వరకు మాకు దీనిపై ఎలాంటి ప్రతిపాదనలు కూడా రాలేదని తేల్చి చెప్పారు. కేవలం దేశంలోని కొంత భూభాగాన్ని మాత్రమే చేర్చుకుంటామని ఆహ్వానించడం సరైన పద్దతి కాదన్నారు. ఉక్రెయిన్‌ దేశం అంటే మా మొత్తం భూభాగం అని అర్థం.. రష్యా అనేది వేరు అని జెలెన్‌స్కీ వెల్లడించారు.

Exit mobile version