Ukraine Russia War: రష్యా దాడుల్లో హీరోయిన్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ మరోసారి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పట్టుకోసం ప్రయత్నిస్తున్న రష్యా బలగాలు.. తీవ్రదాడులకు పాల్పడుతున్నాయి.. అదే స్థాయిలో ఉక్రెయిన్ సేనల నుంచి ప్రతిఘటన కూడా తప్పడంలేదు.. ఇక, ఇప్పటికే నలుగురు రష్యా మేజర్ జనరల్స్ తమ చేతితో హతమయ్యారని, 14 వేల మంది సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ చెబుతోంది.. ఇదే సమయంలో.. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు, ప్రముఖులు కూడా ప్రాణాలు కోల్పోతోన్నారు.. తాజాగా, రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్‌లో ప్రముఖ రంగస్థల, సినీ నటి ఒక్సానా ష్వెట్స్ మృతిచెందారు.
Read Also: Gold Price: పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్..
Also Read
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్‌పవార్ ప్రశంసలు
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్‌పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్‌తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
ఎలాగైనా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ని ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్న రష్యన్ బలగాలు… ప్రభుత్వ కార్యాలయాలతో పాటు.. నివాస స్థలాలపై కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.. ఈ దాడుల్లో 67 ఏళ్ల ఒక్సానా ప్రాణాలు విడిచినట్టు ఆమె నేతృత్వంలో పనిచేస్తున్న ‘యంగ్ థియేటర్’ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. 1955లో జన్మించిన ఒక్సానా ష్వెట్స్.. ఇవాన్ ఫ్రాంకో థియేటర్, కీవ్ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్‌లో అభ్యసించారు. ఇక, సుదీర్ఘకాలం పాటు థియేటర్ ఆర్టిస్టుగా కొనసాగారు.. ఉక్రెయిన్‌లతో పాటు.. ఇతర దేశాలకు సుపరిచుతురాలు.. ఈ నేపథ్యంలోనే ఆమెను ఉక్రెయిన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెరిటెడ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా వరించింది.. ఓవైపు థియేటర్ ఆర్టిస్టుగా.. మరోవైపు సినిమాల్లోనూ నటించారు.. అనేక సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకును ఆకట్టుకున్నారు.. ఇలా.. రష్యా దాడుల్లో ఆమె ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. ఇక, ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు, గ్రామీణ ప్రాంతాలు, కీవ్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి.
తాజావార్తలు
-
AC: భారత్‌లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్‌లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
-
CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!