Uganda: “మీ దేశంలో అందమైన మహిళను నాకు ఇవ్వండి”.. ఉగాండా ఆర్మీ చీఫ్ షాకింగ్ డిమాండ్..
- మాకు 1 బిలియన్ డాలర్లు చెల్లించాాలి..
- పెళ్లి చేసుకోవడానికి మీ దేశంలో అందమైన మహిళను ఇవ్వాలి..
- టర్కీకి ఉగాండా ఆర్మీ చీఫ్ సంచలన డిమాండ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uganda: ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడు ఆర్మీ చీఫ్ అయిన ముహుజీ కైనెరుగాబా చేసిన డిమాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమకు 1 బిలియన్ డాలర్లు, మీ దేశంలోని అత్యంత అందమైన మహిళను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని టర్కీని డిమాండ్ చేశారు. ప్రాంతీయ భద్రతా ప్రయత్నాలకు ఉగాండా చేసిన కృషిని గుర్తించలేదని, దానికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉంతటుందని కైనెరుగాబా అన్నారు.
తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, 30 రోజుల్లోగా టర్కీతో దౌత్య సంబంధాలను తెంచుకుంటామని, రాజధాని కంపాలోని వారి కార్యాలయాన్ని మూసేస్తామని ఆయన హెచ్చరించారు. టర్కీలోని అత్యంత అందమైన మహిళను తనకు అప్పగించాలని, ఆమెను పెళ్లి చేసుకుంటాన్ని చెబుతూ ఆ దేశాన్ని కోరడం వివాదాస్పదంగా మారింది. సోమాలియా రాజధాని మొగాదిషు లోని ఓడరేవులు, విమానాశ్రయాలు, అనేక ప్రాజెక్టుల నుంచి టర్కీ లబ్ధి పొందుతోందని కైనెరుగాబా ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల నుండి టర్కీ లాభాలు ఆర్జిస్తుండగా, ఉగాండా చాలా సంవత్సరాలుగా భారీ భద్రతా బాధ్యతను మోస్తోందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
Read Also: Shivraj Singh Chouhan: బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ సీఎం ఎవరో తేల్చేయనున్నది ఈయనే!
ఉగాండా గత రెండు దశాబ్ధాలుగా ఆఫ్రికన్ యూనియన్ మిషన్లలో భాగంగా సోమాలియలో సైనిక దళాలను మోహరించి, ప్రధానంగా అల్ ఖైదాతో సంబంధాలు ఉన్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థతో పోరాడటానికి ఈ దళాలను పంపింది. టర్కీ నుంచి ఉగాండాకు భద్రతా డివిడెంట్‌గా 1 బిలియన్ డాలర్లు అందాలని ఆయన అన్నారు. ఇదే సమయంలో కైనెరుగాబా ఇజ్రాయిల్‌కు మద్దతు తెలిపారు. పవిత్ర భూమిని, మన దేవుడైన యేసు క్రీస్తు భూమిని రక్షించడానికి నా ఆధ్వర్యంలో లక్ష మంది ఉగాండా సైనికులను ఇజ్రాయిల్‌కు పంపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
కైనెరుగాబా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గురించి మాట్లాడుతూ.. ఇటలీ ప్రధానిని వివాహం చేసుకోవడానికి, బదులుగా తనకు భూమిపై అత్యంత అందమైన ఆవులుగా అభివర్ణించిన 100 అంకోలే ఆవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన బహిరంగంగా ప్రకటించారు.
తాజావార్తలు
-
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
-
Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!