Site icon NTV Telugu

Typhoon Ragasa: తైవాన్‌, చైనాలో తుఫాన్ విధ్వంసం.. 17 మంది మృతి

Typhoon Ragasa

Typhoon Ragasa

రాగస తుఫాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు 200 కి.మీ వేగంతో గాలులు వీచడంతో ప్రధాన పట్టణాలన్నీ అతలాకుతలం అయ్యాయి. తుఫాన్ కారణంగా తైవాన్‌లో 14 మంది, ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. వసతులు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్, మెలానియాకు అవమానం! సడన్‌గా ఆగిన యూఎన్ ఎస్కలేటర్ రైడ్‌.. వైట్‌హౌస్ సీరియస్

ఇక హాంకాంగ్‌లో అనేక పాఠశాలలు మూసివేయబడ్డాయి. అలాగే విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. అనేక దుకాణాలు మూసేశారు. నిత్యవసర వస్తువులు స్తంభించిపోయాయి. అలాగే జనజీవనం కూడా అస్తవ్యస్థంగా మారింది.

ఈ మధ్య కాలంలో ఇదే అత్యంత శక్తివంతమైన తుఫాన్‌ల్లో రాగస తుఫాన్ ఒకటి అని అధికారులు పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున హాంకాంగ్ విహార ప్రదేశాలపై దీపస్తంభాల కంటే ఎత్తైన అలలు ఎగసిపడ్డాయి. అలాగే తైవాన్, ఫిలిప్పీన్స్‌లో కూడా తీవ్ర విధ్వంసం సృష్టించింది.

ఇది కూడా చదవండి: Trump: హెచ్‌-1బీ లాటరీ వ్యవస్థపై ట్రంప్ మరో కీలక నిర్ణయం

బుధవారం తెల్లవారుజము నుంచి తీవ్రమైన గాలులు వీచడంతో హాంకాంగ్ నివాసితులు బెంబేలెత్తిపోయారు. చాలా చోట్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలిపోయాయి. గాయపడ్డ పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దక్షిణ చైనా ఆర్థిక శక్తి కేంద్రమైన గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ అంతటా పది లక్షల మందికి పైగా ప్రజలను తరలించినట్లు రాష్ట్ర ప్రసార సంస్థ నివేదించింది. ఇక బుధవారం మధ్యాహ్నం, సాయంత్రం మధ్య తైషాన్, ఝాంజియాంగ్ నగరాల మధ్య టైఫూన్ తీరాన్ని తాకుతుందని జాతీయ వాతావరణ సంస్థ అంచనా వేసింది.

హాంకాంగ్ అబ్జర్వేటరీ ప్రకారం.. రాగస తుఫాను గంటకు 195 కి.మీ (120 మైళ్ళు) వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. తుఫాన్ గంటకు 22 కి.మీ (సుమారు 14 మైళ్ళు) వేగంతో పశ్చిమం లేదా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉందని అంచనా వేసింది.

 

 

Exit mobile version