NTV Telugu Site icon

Twitter: ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ మరో షాక్.. ఈ 3 ఫీచర్ల కోసం ఛార్జీలు చెల్లించాలి..!

Twitter

Twitter

Twitter’s Elon Musk plans to charge you for 3 major and basic features: ట్విట్టర్‌ని హస్తగతం చేసుకున్న తర్వాత షాకుల మీద షాక్‌లు ఇస్తున్నాడు కొత్త బాస్ ఎలాన్ మస్క్. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్‌ని సొంతం చేసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధం అయ్యారు. టేకోవర్ చేసుకున్న గంటల వ్యవధిలో కీలకమైన నలుగురు ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఇందులో సీఈఓ పరాగ్ అగర్వాల్, పాలసీ చీఫ్ విజయగద్దెలలో పాటు పలువురిని తొలగించారు. మొత్తం ట్విట్టర్ బోర్డును రద్దు చేశారు. ఇదిలా ఉంటే 50 శాతం మంది ట్విట్టర్ ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో ఉన్నాడు ఎలాన్ మస్క్. ఇప్పటికే శుక్రవారం నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం అయింది. దాదాపుగా 3800 మంది ట్విట్టర్ నుంచి తొలగించనున్నారు.

Read Also: Twitter: నా ఉద్యోగం పోయింది.. భారతీయుడి ట్వీట్ వైరల్

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ట్విట్టర్ నుంచి ఉచితంగా పొందిన కొన్ని ఫీచర్లకు ఛార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3 రకాల సేవలకు ఛార్జీలు విధించే అవకాశం ఉందని సమాచారం. 1) హై ప్రొఫైల్ యూజర్లకు ప్రైవేట్ మెసేజులు పంపించాలంటే ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. 2) కొన్ని వీడియోలను చూడాలంటే యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయనున్నారు. 3) బ్లూ టిక్ మార్క్ కోసం నెలకు 8 డాలర్ల చెల్లించాల్సిందే అని ఇప్పటికే మస్క్ స్పష్టం చేశాడు.

ట్విట్టర్ లో హై ప్రొఫైల్ వినియోగదారులకు ప్రైవేట్ మెసేజ్ లు పంపాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందే అని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే హై ప్రొఫైల్ యూజర్ల కిందికి ఎవరెవరు వస్తారనే దానిపై స్పష్టత లేదు. బ్లూ టిక్ మార్క్ కోసం ఇకపై నెలకు 8 డాలర్లు(సుమారుగా రూ. 600) వసూలు చేస్తామని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. అయితే ఇతర దేశాలకు ఎంతెంత సబ్‌స్క్రిప్షన్ ధర ఉంటుందో వెల్లడించలేదు. వినియోగదారులు నిర్ధిష్టమైన వీడియోలను చూడాలంటే డబ్బులు చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు. వీడియోలను అప్ లోడ్ చేయడానికి, సెర్చ్ చేయాలంటే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.