Twitter Blue Will Come To India with in a month: ట్విట్టర్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సంస్థలోని పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. ఇందులో భారతీయ సీఈఓ పరాగ్ అగర్వాల్, విజయగద్దెలు ఉన్నారు. ట్విట్టర్ బోర్డును రద్దు చేసి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ట్విట్టర్ లోని సగం మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ప్రారంభించారు ఎలాన్ మస్క్. శుక్రవారం నుంచే పలువురు ఉద్యోగులకు ఉద్వాసన పలికింది ట్విట్టర్. మొత్తం 7500 మంది ఉద్యోగులు ఉంటే 3800 మంది ఉద్యోగులను తొలగించనుంది.
Read Also: Munugode Bypoll Results Live Updates: మునుగోడు ఫలితాలు లైవ్ అప్‌డేట్స్..
ఇదిలా ఉంటే ట్విట్టర్ లోని వెరిఫైడ్ అకౌంట్లకు ఉండే బ్లూ టిక్ మార్క్ కోసం ప్రతీ నెల 8 డాలర్లను వసూలు చేస్తామని ఎలాన్ మస్క్ స్పష్టం చేశాడు. భారతీయ కరెన్సీలో చూస్తే సుమారుగా రూ.700గా ఉండనుంది. ఇదిలా ఉంటే ట్విట్టర్ బ్లూ ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. కొత్త వెరిఫికేషన్ సిస్టమ్ తో కూడిన ట్విట్టర్ బ్లూ యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలోని ఐఫోన్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ లోని ట్విట్టర్ యాప్ లో కొత్త అప్‌డేట్‌లో.. ఈ రోజు నుంచి మేము ట్విట్టర్ బ్లూకి కొత్త ఫీచర్లను జోడిస్తున్నాము..త్వరలో మరిన్ని అందుబాటులోకి రాబోతున్నాయనే సైన్ అప్ చేస్తే నెలకు 7.99 డాలర్లతో బ్లూని పొందండి అని నోటిఫికేష్ ఉంది.
.@elonmusk When can we expect to have the Twitter Blue roll out in India? #TwitterBlue
— Prabhu (@Cricprabhu) November 5, 2022
ఇదిలా ఉంటే భారత్ లోకి ట్విట్టర్ బ్లూ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే ఉత్కంఠ అందరు యూజర్లలో ఉంది. అయితే దీనిపై భారతీయ నెటిజెన్ ట్విట్టర్ లో దీని గురించి ఎలాన్ మస్క్ ప్రశ్నించారు. దీనికి ‘‘హోప్ ఫుల్లీ లెస్ దెన్ ఏ మంత్’’ అని ఒక నెలలోపు ట్విట్టర్ బ్లూ ఇండియాలో అందుబాటులోకి వస్తుందని మస్క్ సమాధానం ఇచ్చారు. ట్విట్టర్ బ్లూ ద్వారా మరిన్ని సేవలను అందించబోతోంది ఆ సంస్థ. ఇదిలా ఉంటే ట్విట్టర్ బ్లూ ధర ఇండియాలో ఎంత ఉంటుందనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రజల కొనుగోలు శక్తికి సమానంగా ధరను సర్దుబాటు చేస్తామని మస్క్ వెల్లడించారు. అయితే దీనిని ఎలా నిర్థారిస్తారనేదానిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు.
