Site icon NTV Telugu

Twitter: ట్విట్టర్ యూజర్లకు షాక్.. ఇకపై బ్లూ టిక్ ఉంటే ఇంత చెల్లించాల్సిందే..

Elon Musk

Elon Musk

Twitter blue tick at $8 per month, says Elon Musk: ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంస్థలో పనిచేసే కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను రద్దు చేశారు. దీంతో ట్విట్టర్ కు కేవలం మస్క్ మాత్రమే ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతున్నారు. 75 శాతం ఉద్యోగులను తొలగించే ప్లాన్ లో ఉన్నారు. ట్విట్టర్ సేవలను ఇకపై ఉచితంగా పొందలేరని చెప్పకనే చెబుతున్నారు.

Read Also: Ajay Jadeja: ఆ విషయంలో రోహిత్ ఫెయిల్.. జడేజా సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే ట్విట్టర్ యూజర్లకు షాక్ ఇచ్చారు ఎలాన్ మస్క్. ఇకపై బ్లూటిక్ ఉన్న వారు నెలకు 8 యూఎస్ డాలర్లు చెల్సించాల్సిందే అని స్పష్టం చేశారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. పవర్ టూ పీపుల్.. బ్లూటిక్ నెలకు 8 డాలర్లు అని ట్వీట్ చేశారు. భారతదేశ కరెన్సీలో దాదాపుగా నెలకు రూ.700 చెల్లించాలి. దేశంలో కొనుగోలు శక్తి ఆధారంగా ధరలను సర్దుబాటు చేస్తామని వెల్లడించారు. ఇకపై వెరిఫైడ్ అకౌంట్ ఉన్నవాళ్లు నెలకు డబ్బు చెల్లించాల్సిందే. బ్లూ టిక్ ఉన్న వారికి మరిన్ని ఫీచర్లు అందించే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. బ్లూ టిక్ ఉన్న వాళ్లు ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉంటారని వెల్లడించారు. రిప్లైలు, సెర్చ్ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎక్కవ నిడివి కలిగిన వీడియోలను, ఆడియోలను పోస్ట్ చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు.

మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ కొనుగోలు చేసిన మస్క్, సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, పాలసీ చీఫ్ విజయ గద్దెతో సహా పలువురిని తొలగించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ను రద్దు చేసి ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు.

Exit mobile version