బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ దూసుకెళ్తున్నారు.. మొదటి నుంచి ఐదు రౌండ్లలో తిరులేని విజయం సాధించారు.. ఇక, ఆయన ప్రధాని కావడమే తరువాయి అని అంతా భావిస్తున్న తరుణంలో.. సీన్ రివర్స్ అయ్యింది.. ఎందుకంటే.. విదేశాంగమంత్రి లిజ్ ట్రస్.. ప్రధాని పదవి రేసులోకి దూసుకొచ్చారు.. బ్రిటన్ ప్రధాని రేసులో… తుదిపోరులో నిలిచిన కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు రిషి సునాక్, లిజ్ ట్రస్‌లలో… సభ్యులు ఎవరికి ఎక్కువగా మద్దతిస్తున్నారనే అంశంపై… యూగోవ్ సంస్థ రెండు రోజుల పాటు సర్వే చేసింది. ఈ సర్వేలో 730 మంది సభ్యులు పాల్గొనగా… వారిలో 62 శాతం మంది లిజ్ ట్రస్‌కే తమ ఓటు అని చెప్పారు. 38 శాతం మంది రిషి సునాక్‌కు మద్దతుగా నిలిచారు. సర్వేల్లో గతవారం వరకు రిషి సునాక్‌పై 19 శాతం పాయింట్లు లీడ్ సాధించిన ట్రస్… ఇప్పుడు 24 శాతం పాయింట్ల లీడ్‌కు ఎగబాకాకారు.
Read Also: KTR: ‘బీఎస్ కుమార్’.. భలే సెటైర్. ఆకట్టుకున్న కేటీఆర్ కౌంటర్.
కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది ఎంపీలు రిషికి మద్దతుగా నిలిచినప్పటికీ… పార్టీ సభ్యుల్లో మాత్రం ట్రస్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. కొద్దిరోజుల్లో మొదలుకానున్న సమ్మర్ క్యాంపెయిన్‌లో… రిషి, ట్రస్ టోరీ సభ్యులను కలిసి తమకు మద్దతు తెలపాలని కోరనున్నారు. ఆ తర్వాత ట్రస్‌కు ఇంకా ఎక్కువ మద్దతు లభిస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బ్రిటన్‌లోని బెట్టింగ్ రాయుళ్లు కూడా ట్రసే తమ ఫేవరెట్ అంటున్నారు. బ్రిటన్ ప్రధానిని ఎన్నుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల బ్యాలెట్ ఓటింగ్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. లక్షా 60 వేల మందికి పైగా ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని అంచనా. మహిళలు, పురుషులతో పాటు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసే వారిలో మెజార్టీ ఓటర్లు లిజ్ ట్రస్‌కే జై కొడుతున్నట్లు స్కై న్యూస్ సర్వే కూడా తెలిపింది. ప్రధాని రేసులో జరిగిన ఐదో రౌండ్లో రిషికి 137 ఓట్లు రాగా… ట్రస్‌కు 113 మాత్రమే వచ్చాయి. కానీ, సభ్యుల మద్దతు విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయేలా ఉందంటున్నాయి… సర్వేలు. దాంతో… ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.