Donald Trump: ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబ్ పేల్చారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసితో జరిగిన సమావేశంలో, ఇరాన్‌తో ప్రస్తుతం అవగాహనం ఒప్పందం(ఎంఓయూ) ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఒకవేళ ఆయన ఈ ఒప్పందాన్ని వ్యతికిస్తే, అమెరికా తిరిగి ఇరాన్‌పై దాడికి దిగుతుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో చర్చలు చాలా బలమైన ఒప్పందానని కుదిర్చాయని, అయితే తుది రూపం ఎలాం ఉంటుందో ఎవరికీ పూర్తిగా తెలియనది వెల్లడించారు. చాలా మంది ఈ ఒప్పందం పట్ల సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు.
ఒక వేళ ఈ ఒప్పందం కుదరకపోతే ప్రపంచ ఆర్థిక అస్థిరతం, మాంద్యం ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. కొంత మంది ప్రపంచ మాంద్యాన్ని కోరుకుంటున్నారని ఆరోపించారు. ఆర్థిక మాంద్యం కోరుకునే వారు మూర్ఖులని ట్రంప్ అన్నారు. అలాంటి వారికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, స్థిరత్వం ప్రాముఖ్యత అర్థం కాదని ఆయన అన్నారు. ఆ జలసంధి ఎప్పటికీ తెరుచుకోదని హార్ముజ్ గురించి ప్రస్తావించారు.
300 బిలియన్ డాలర్లును ఇరాన్‌లో అమెరికా పెట్టుబడిగా పెడుతుందనే వాదనల్ని ట్రంప్ తోసిపుచ్చారు. అలాంటి నివేదికలు పూర్తిగా అవాస్తమని అన్నారు. ప్రస్తుతం అవగాహనా ఒప్పందం పూర్తిగా ఖరారు కాలేదని చెప్పారు. ఒక వేళ డీల్ కుదరకపోతే తిరిగి యుద్ధానికి తిగవచ్చని, సైనిక చర్యకు సిద్ధపడుతామని ట్రంప్ హెచ్చరించారు. జీ7 సమావేశంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటన ఇరాన్‌కు హెచ్చరికగా మారింది.

