Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
- మళ్లీ చెలరేగుతోన్న మధ్యప్రాచ్యం
- ఇరాన్-అమెరికా పరస్పర హెచ్చరికలు
- త్వరలో ఇరాన్‌పై భారీ దాడులుంటాయన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం మళ్లీ మొదలు కాబోతుందా? ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు సిద్ధపడుతున్నాయా? ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధమైందా? గల్ఫ్ దేశాలు లక్ష్యంగా భీకర దాడులు జరగొచ్చా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్ ముందుకు రావడం లేదు. చర్చల పేరుతో కాలక్షేపం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ భారీ స్థాయిలో దాడి చేయాల్సి రావొచ్చని వార్నింగ్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘‘యుద్ధం జరగకూడదని ఆశిస్తున్నాను. కానీ అవసరమైతే వారికి మరోసారి భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు. ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేను.. చాలా త్వరలో మీకు తెలుస్తుంది’’ అని హెచ్చరించారు.
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు పరిమిత సమయం మాత్రమే ఇస్తున్నామని.. ఎందుకంటే ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండనివ్వబోమని స్పష్టం చేశారు. ‘‘వాళ్లు ఆ ఆయుధాలను ఉపయోగిస్తారనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నేను వారితో వ్యవహరిస్తున్నాను.. వారు తీవ్ర మౌలికవాదులు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాంకేతికంగా ఏప్రిల్ 8 నుంచి అమల్లో ఉంది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత నెలల తరబడి జరిగిన ఘర్షణల అనంతరం ఈ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే మధ్యవర్తుల ద్వారా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి.
ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో కూడా స్పందించారు. ఇరాన్‌పై అమెరికా చేయాలని భావించిన దాడిని తాత్కాలికంగా నిలిపివేయాలని గల్ఫ్ దేశాల నేతలు కోరారని తెలిపారు. ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నందున దాడిని వాయిదా వేసినట్లు చెప్పారు. అవసరమైతే పూర్తి స్థాయి భారీ సైనిక దాడికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒప్పందం కుదరకపోతే క్షణాల్లోనే ఇరాన్‌పై భారీ దాడికి అమెరికా సైన్యాన్ని సిద్ధంగా ఉండమని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఇక ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ట్రంప్ బెదిరింపునే శాంతికి అవకాశం అంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు ఇరాన్ సైన్యం కూడా ప్రతిదాడుల హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ సైన్య ప్రతినిధి మొహమ్మద్ అక్రమినియా మాట్లాడుతూ.. అమెరికా మళ్లీ దాడులు ప్రారంభిస్తే అమెరికాపై ‘‘కొత్త యుద్ధ ఫ్రంట్లు’’ తెరవబడతాయని హెచ్చరించారు. కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందని కూడా పేర్కొన్నారు.
ఇక ఈ ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని బరాకా అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని మే 17న మూడు డ్రోన్లు దాడికి యత్నించినట్లు యూఏఈ వెల్లడించింది. ఆ డ్రోన్లు ఇరాక్ భూభాగం నుంచి ప్రయాణించినట్లు సాంకేతిక దర్యాప్తులో తేలిందని తెలిపింది. ఈ ఘటనకు ఇరాన్ లేదా ఇరాన్ మద్దతు గల గ్రూపులు కారణమై ఉండొచ్చని యూఏఈ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.
ఇదిలా ఉంటే అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలకు మరింత సమయం అవసరమని ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ తెలిపారు. గత నెల పాకిస్థాన్‌లోనే అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. ట్రంప్ తాజా హెచ్చరికలు.. ఇరాన్ ప్రతిస్పందనలు చూస్తుంటే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
.@POTUS on Iran: "Whether it's popular or not popular, I have to do it — because I'm not going to let the world be blown up on my watch. It's not going to happen." pic.twitter.com/zL4eSIndsY
— Rapid Response 47 (@RapidResponse47) May 19, 2026
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!