Donald Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. వాషింగ్టన్‌లో ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’ తొలి సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. మిడిల్ ఈస్ట్‌లో భారీ స్థాయిలో అమెరికా సైనిక సమీకరణ జరుగుతోందని, ఇరాన్ త్వరగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, అప్పటికీ ఒప్పుకోకపోతే అమెరికా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, ఏమి జరుగుతోందో వచ్చే 10 రోజుల్లో మీరే తెలుసుకుంటారు అని అల్టిమేటం జారీచేశారు.
ఇరాన్‌తో అర్థవంతమైన ఒప్పందా చేయడం కష్టమని చెప్పారు. డీల్ కుదరకుంటే చెడు పరిణామాలు సంభవిస్తాయని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. శాంతి మార్గంలో మాతో చేరండి అంటూ టెహ్రాన్‌ను కోరారు. మరోవైపు, అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో చర్చలు జరుపుతున్నారు. యూఎస్ ఇరాన్ అణు చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు.
Read Also: Oil Imports: భారత్-అమెరికా ఆయిల్ ఘర్షణలో గెలిచిన సౌదీ అరేబియా..
ఇదిలా ఉంటే, మరోవైపు అమెరికా ఇరాన్‌పై దాడులకు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వారాంతం నుంచే ఇరాన్‌పై వైమానిక దాడులకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికన్ సైన్యం వైట్‌హౌజ్‌కు సమాచారం ఇచ్చింది. అయితే, ట్రంప్ దాడులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరాన్ రాజకీయ-సైనిక నాయకత్వాన్ని టార్గెట్ చేసే ప్రణాళికలు కూడా అమెరికా దగ్గర ఉన్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ.. తాము యుద్ధం కోరుకోవడం లేదని, కానీ అమెరికా తమపై ఒత్తిడి చేస్తే తలవంచబోమని చెప్పారు.
అమెరికా మిడిల్ ఈస్ట్‌లో భారీగా యుద్ధ సామాగ్రిని మోహరించింది. 13 అమెరికా యుద్ధ నౌకలు ప్రస్తుతం అక్కడ మోహరించాయి. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 9 డిస్ట్రాయర్లు, 3 లిట్టోరల్ కాంబాట్ షిప్స్, ప్రపంచంలోనే అతిపెద్ద నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అట్లాంటిక్ నుంచి మధ్యప్రాచ్యం వైపు వెళ్తోంది. F-22 రాప్టర్లు, F-15, F-16 ఫైటర్లు,
KC-135 రీఫ్యూయలింగ్ విమానాలు మిడిల్ ఈస్ట్ వైపు వెళ్లాయి.
