గ్రీన్లాండ్ విషయంలో సహకరించకపోతే యూరోపియన్ దేశాలపై సుంకం విధిస్తానని ఇటీవల ట్రంప్ బెదిరించారు. తాజాగా అధ్యక్షుడు మెత్తబడ్డారు. ఆ బెదిరింపును వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ పాల్గొన్నారు. ఇక నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో సమావేశం తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. ట్రూత్ సోషల్ మీడియాలో.. ఫిబ్రవరి 1 నుంచి యూరోపియన్స్ దేశాలపై అమల్లోకి రావాల్సిన సుంకాలు విధించడం లేదని ట్రంప్ రాసుకొచ్చారు. మిత్రదేశాలపై తాను విధించిన సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి:Donald Trump: ప్రధాని మోడీ ‘‘అద్భుత నాయకుడు’’.. దావోస్‌లో ట్రంప్ ప్రశంసలు..
వెనిజులాను స్వాధీనం చేసుకున్నాక.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ మనుసు పాడేసుకున్నారు. అమెరికా భద్రతా దృష్ట్యా గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవడం అవసరం అని.. చైనా, రష్యా కబంధహస్తాల నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షించడమే అమెరికా బాధ్యత అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం గ్రీన్లాండ్ డెన్మార్క్ ఆధీనంలో ఉంది. ఇక డెన్మార్క్ నాటో సభ్యత్వం కలిగి ఉంది. దీంతో యూరోపియన్ దేశాలు అమెరికా తీరును తీవ్రంగా తప్పుపట్టాయి. ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోబోనివ్వమని తేల్చి చెప్పాయి. దీంతో ట్రంప్ మిత్రదేశాలపై బెదిరింపులకు దిగారు. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకునే విషయంలో సహకరించకపోతే యూరోపియన్ దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మిత్రదేశాల మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో దావోస్ పర్యటనలో ఉన్న ట్రంప్.. నాటో సెక్రటరీ జనరల్‌ను కలిసిన తర్వాత మెత్తబడ్డారు. బెదిరింపులు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇద్దరి సమావేశంలో ఏం జరిగిందో మాత్రం వివరించలేదు.
ఇది కూడా చదవండి: Off The Record : రాజ్యసభ రేస్‌లో దింపుడు కల్లం ఆశలు?