Site icon NTV Telugu

Trump: పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు.. మీడియా ముందు ట్రంప్ ఆవేదన

Trump2

Trump2

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. మాస్కో ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసిందని.. సైన్యాన్ని కోల్పోయింది.. అయినా కూడా ఇంకెందుకు ముందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదని వాపోయారు.

ఇది కూడా చదవండి: Hamas-Trump: ట్రంప్ హెచ్చరికలు లెక్క చేయని హమాస్.. తాజాగా 8 మంది బహిరంగ కాల్చివేత

పుతిన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆ స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోందన్నారు. కానీ యుద్ధం విషయంలో మాత్రం నిరాశ చెందినట్లు తెలిపారు. యుద్ధం కొనసాగించడం చెడ్డ విషయం అన్నారు. నాలుగేళ్లుగా యుద్ధం చేయడం ఏ మాత్రం భావ్యం కాదన్నారు. బహుశా లక్షన్నర మంది సైనికులను కోల్పోయి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇది చాలా భయంకరమైన యుద్ధంగా అభివర్ణించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది చాలా పెద్ద విషయం అన్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు శుభవార్త.. గ్రీన్ క్రాకర్ల వాడకానికి అనుమతి

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు కూడా జరిపింది. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో సమావేశం అయ్యారు. ఈ చర్చలు కూడా సత్ ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: Maharashtra: ఢిల్లీ బాబా తరహాలో మహారాష్ట్రలో కూడా మరో కీచక పర్వం.. ఇద్దరు అరెస్ట్

గాజాతో పాటు ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని కూడా ఆపేందుకు ట్రంప్ ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. గాజా విషయంలో విజయం సాధించారు కానీ.. ఉక్రెయిన్-రష్యా విషయంలో మాత్రం ట్రంప్ సక్సెస్ కాలేకపోయారు. అయితే శాంతి కోసం ట్రంప్ ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లు క్రెమ్లిన్ మంగళవారం తెలిపింది. రష్యా చర్చలకు సిద్ధంగా ఉందని.. శాంతి ఒప్పందం సాధించడంలో అమెరికా విజయం సాధించగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు.

 

Exit mobile version