Site icon NTV Telugu

Trump: వెనిజులా చమురు విక్రయంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఏ దేశాలకు సేల్ అంటే..!

Trump1

Trump1

వెనిజులా చమురు విక్రయానికి ట్రంప్ పిలుపునిచ్చారు. 50 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో చమురు కంపెనీ అధిపతులతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కంపెనీలకు పలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై నేరుగా తమతో సంబంధాలు పెట్టుకోవాలని.. వెనిజులాతో ఎలాంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదని సూచించారు. పూర్తి భద్రతను కల్పిస్తామని కార్యనిర్వాహకులకు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Iran: పూర్తిగా అదుపుతప్పిన ఇరాన్.. అగ్నికీలల్లో వాహనాలు, ఆస్తులు

ఇక వైట్‌హౌస్‌లో చమురు కంపెనీ సీఈవోలతో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్ కంపెనీలు.. వెనిజులాలో కనీసం 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా వెనిజులాలో అమెరికా సైన్యం చేసిన ఆపరేషన్‌ను ప్రశంసించారు. సైన్యానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అమెరికా సైన్యం చాలా గొప్ప పని చేసిందంటూ కొనియాడారు.

చమురుపై ఇక వెనిజులాకు ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే నేరుగా తమతోనే సంప్రదించాలని సూచించారు. ఇక ఏ చమురు కంపెనీ వెనిజులాకు వెళ్లాలో తానే నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. నిన్న వెనిజులా నుంచి 30 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికా అందుకున్నట్లు తెలిపారు. త్వరలో మరో 50 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధి చేసి అమ్మడం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇక వచ్చే వారం మరోసారి సమావేశం జరుగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.

భారత్‌కు..
ఇక వెనిజులా నుంచి భారతదేశానికి చమురు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైట్‌హౌస్ సూచించిందని ట్రంప్ పరిపాలన సీనియర్ అధికారి తెలిపారు. వెనిజులా చమురును అన్ని దేశాలకు విక్రయించడానికి వాషింగ్లన్ సిద్ధంగా ఉందని ఇంధన కార్యదర్శి క్రిస్టోఫర్ రైట్ ఇటీవల చేసిన ప్రకటనను ఈ సందర్భంగా ఆ అధికారి గుర్తుచేశారు. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Exit mobile version