Trump: యూకే టూర్లో ట్రంప్‌కు చేదు అనుభవం.. జెఫ్రీ ఎప్స్టీన్తో ఉన్న ఫొటోలు ప్రదర్శన
- యూకే టూర్లో ట్రంప్‌కు చేదు అనుభవం
- జెఫ్రీ ఎప్స్టీన్తో ఉన్న ఫొటోలు ప్రదర్శన
- నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మోలానియో బుధవారం, గురువారం లండన్‌లో పర్యటించనున్నారు. బుధవారం విండ్సర్ కోటలో కింగ్ చార్లెస్-3, క్వీన్ కెమెల్లా ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇక గురువారం ప్రధాని కీర్ స్టార్మర్తో ట్రంప్ భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi Birthday: ప్రధాని మోడీకి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు..
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
ఇదిలా ఉంటే ట్రంప్ యూకే పర్యటన సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. యూకేలోని విండ్సర్ కోటపై అధ్యక్షుడు ట్రంప్, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ఉన్న ఫొటోలు.. వీడియో ఫుటేజ్ ప్రదర్శింపబడింది. విండ్సర్ కాజిల్ టవర్‌పై చాలా నిమిషాల పాటు నాలుగు చిత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో లండన్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇది నిరసనకారులు చేసిన పనిగా పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ ఇద్దరి నాయుకులకు అగ్ని పరీక్షలా మారిందా?
వైరల్ స్టంట్లకు పేరుగాంచిన లెడ్ బై డాంకీస్ గ్రూప్.. రాజకీయ నాయకులను టార్గెట్‌గా చేసుకుని ఇలా చేస్తుంటుంది. ఇందులో భాగంగా మంగళవారం ఈ చిత్రాలను ప్రదర్శించినట్లుగా గుర్తించింది. ట్రంప్ టూర్‌కు ముందు ఇలాంటి చిత్రాలు ప్రదర్శించడంపై బ్రిటన్ ప్రభుత్వం షాక్‌కు గురైంది. అంతేకాకుండా ట్రంప్-జెఫ్రీ కలిసి నృత్యం చేస్తున్న ఫుటేజ్‌ను కూడా ప్రదర్శించారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
విండ్సర్ కోటపై అనధికార కార్యకలాపాలను చాలా తీవ్రంగా పరిగణిస్తామని థేమ్స్ వ్యాలీ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ ఫెలిసిటీ పార్కర్ తెలిపారు. అధికారులు వేగంగా స్పందించి ప్రొజెక్షన్‌ను ఆపి వేయించారని చెప్పారు. స్థానిక పోలీసులు వెంటనే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ టూర్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యే సూచనలు ఉన్న నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా లైంగిక ఆరోపణలు కలిగిన జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయంటూ న్యూయార్క్ టైమ్స్ వరుస కథనాలు ప్రచురిస్తోంది. దీనిపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. తనపై, తన కుటుంబంపై దశాబ్దాలుగా అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తోందని.. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలో రూ.1.32 లక్షల కోట్లకు దావా వేస్తున్నట్లు వెల్లడించారు.
జెఫ్రీ ఎప్స్టీన్ అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడినట్లుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇలా రెండు దశాబ్దాల పాటు ఈ చీకటి వ్యవహారం నడిచింది. 2005లో ఈ సెక్స్ స్కామ్ బట్టబయలైంది. 2019, ఆగస్టులో అతడు జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. అయితే ఎప్స్టీన్తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నట్లు అమెరికా పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!