భారత్‌పై మరోసారి ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో నోరుపారేసుకున్నారు. అమెరికాతో వాణిజ్య చర్చలపై భారత్ ఏదొక సమయంలో దిగి రావాల్సిందేనన్నారు. లేదంటే మంచిగా ముగియదని వ్యాఖ్యానించారు. ‘రియల్ అమెరికాస్ వాయిస్’ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.
ఇది కూడా చదవండి: Urmila : 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘రంగీలా’.. ఊర్మిళ ఎమోషనల్ పోస్ట్
యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియాలు అమెరికాతో మంచి వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నాయని.. అమెరికాను సద్వినియోగం చేసుకుంటున్నాయని.. చాలా దగ్గరగా పని చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అయితే భారత్ మాత్రం ప్రపంచంలో ఏ దేశం వేయనంతగా అత్యధిక సుంకాలను అమెరికా దగ్గర వసూలు చేస్తుందని.. దాన్ని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందు భారత్ మాస్కో దగ్గర చమురు చాలా తక్కువగా కొనుగోలు చేసేదని.. యుద్ధం తర్వాత ఎక్కువగా కొనుగోలు చేస్తోందని అందుకే రష్యా బాగా లాభార్జన పొందుతుందని వివరించారు. రష్యా, చైనాలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే అది భారత్‌కు ముగింపు ఉండదంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లో మోడీ పర్యటన.. వరద ప్రాంతాల పరిశీలన
భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. అన్ని దేశాల కంటే భారత్‌పై ఎక్కువ సుంకం వసూలు చేశారు.
