Site icon NTV Telugu

Charlie Kirk: చార్లీ కిర్క్‌కు ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’.. హత్య తర్వాత ట్రంప్ ప్రకటన..

Trump To Award Charlie Kirk

Trump To Award Charlie Kirk

Charlie Kirk: హత్యకు గురైన ట్రంప్ సన్నిహితుడు, మద్దతుదారు చార్లీ కిర్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం అత్యున్నత పౌరపురస్కారమైన ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉటా యూనివర్సిటీలో కిర్క్‌ను ఓ ఆగంతకుడు కాల్చి చంపాడు. క్యాంపస్‌లోని సోరెన్‌సెన్ సెంటర్ ప్రాంగణంలో నిర్వహించిన డిబేట్ సమయంలో హత్యకు గురయ్యారు. మరణానంతరం ట్రంప్ కిర్క్‌కి ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: Gold Alert: అలర్ట్.. పసిడి మెరుగులు పైపైనేనా.. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయండి

పెంటగాన్‌లో జరిగిన 9/11 స్మారక కార్యక్రమంలో మాట్లాడుతూ, ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఆయనకు ఈ మెడల్ ప్రధానం చేయడానికి సంతోషిస్తున్నట్లు చెప్పారు. చార్లీని తామంతా మిస్ అవుతున్నామని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. కిర్క్‌పై దాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఆయను గ్రేట్ లెజెండరీ అని ప్రశంసించారు. యూఎస్ ఎన్నికల సమయంలో ట్రంప్‌కు గట్టి మద్దతుదారుగా చార్లీ కిర్క్ ఉన్నారు. ట్రంప్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు.

ఇదిలా ఉంటే, ఈ హత్యపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. కాలేజ్ పైకప్పు నుంచి దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటకే కిర్క్‌పై దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హంతకుడు హైపవర్ రైఫిల్ వాడినట్లు కనుగొన్నారు. అనుమానిత హంతకుడు కాలేజీ వయసు ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడని ఊటీ డీపీఎస్ కమిషనర్ బ్యూ మాసన్ చెప్పారు. బుధవారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరికి కాల్పులతో సంబంధం లేదని నిర్ధారణ అయింది. అసలు నిందితుడి కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

Exit mobile version