Gold Alert: బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరి చెప్పండి. మీ లైఫ్‌లో మీ ఇళ్లాలు పెళ్లిరోజు అని, పుట్టిన రోజు అని, చిన్న కోరిక అని పరుగులు పెడుతున్న పసిడిని చూపించి తనకు కొనివ్వమని అడిగడం ఎప్పుడైనా ఎదురైందా. ఆవిడ ప్రేమగా అడగటం మీరు కాదనడం బాగోదని షాప్‌కు వెళ్లి కొనిపించే ఉంటారు. ఆగండి ఇక్కడే మీరు ఒక క్షణం అలర్ట్‌గా ఉండాలి. ఎందుకు అలర్ట్ అంటున్నాను అంటే.. బంగారం పేరుతో ఈ మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మార్కెట్లో ఏదీ కొనాలన్నా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. అసలు మీరు కొనుగోలు చేస్తున్న బంగారం నిజమైనదేనా అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా.. ఎందుకైనా మంచిది ఈ స్టోరీని ఒక లుక్ వేయండి..
READ ALSO: AP Politics : జనంలోకి వెళ్ళడానికి సిద్ధమౌవుతున్న జగన్
‘బీఐఎస్ కేర్’ ఏంటో చూడు..
కేంద్ర సర్కార్ పడిసి స్వచ్ఛత విషయంలో మోసాలు జరుగుతున్నాయనే నేపథ్యంలో హాల్ మార్క్ విధానాన్ని తీసుకువచ్చిందని మీలో ఎంత మందికి తెలుసు. ఈ విధానం అందుబాటులోకి తీసుకురావడం వల్ల బంగారం నాణ్యతపై కొనుగోలు దారులకు అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) బంగారం నాణ్యతను తెలుసుకోవడానికి మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బీఐఎస్ కేర్’ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా బంగారం క్వాలిటీని సులభంగా తెలుసుకునే వీలుంటుంది.
బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో ‘బీఐఎస్ కేర్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మీ పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, ఓటీపీతో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు యాప్ ఓపెన్ కాగానే ‘వెరిఫై హెచ్‌యూఐడీ’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీరు కొనుగోలు చేసే ఆభరణంపై ఉన్న హెచ్‌యూఐడీ నంబర్‌ను ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై నొక్కాలి. అప్పుడు వెంటనే మీ ఆభరణానికి సంబంధించిన హాల్‌మార్క్ చేయించిన షాప్, హాల్ మార్క్ వేసిన కేంద్రం, బంగారం స్వచ్ఛత వంటి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఇది చాలా సింపుల్ గురు. అందుకే చెప్పేది.. ఒకసారి చెక్ చేస్తే పోయేది ఏం లేదని.
కేంద్ర ప్రభుత్వం ఈ హల్‌మార్క్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత అందులో కొన్ని మార్పులు చేసింది. బంగారు ఆభరణాలపై ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ కోడ్‌ను తప్పసరి చేస్తూ కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్క ఆభరణానికి ప్రత్యేక హెచ్‌యూఐడీ నెంబర్ కేటాయిస్తున్నారు. ఈ కోడ్ ఆధారంగానే బంగారం స్వచ్ఛమైందా. కాదా అనేది తెలుస్తుంది. అందుకే ఇప్పటి నుంచి కొనుగోలు చేసే బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. సరేనా..
READ ALSO: INS Aravali: INS ఆరావలి.. హిందూ మహాసముద్రంపై భారత్ నిఘా నేత్రం