Charlie Kirk: చార్లీ కిర్క్‌కు ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’.. హత్య తర్వాత ట్రంప్ ప్రకటన..
- మరణానంతరం చార్లీ కిర్క్‌కు యూఎస్ అత్యున్నత పౌర పురస్కారం..
- బుధవారం ఊటా యూనివర్సిటీలో హత్యకు గురైన కిర్క్..
- ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ను ప్రకటించిన ట్రంప్..
- ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, మద్దతుదారుగా కిర్క్‌కు పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charlie Kirk: హత్యకు గురైన ట్రంప్ సన్నిహితుడు, మద్దతుదారు చార్లీ కిర్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం అత్యున్నత పౌరపురస్కారమైన ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉటా యూనివర్సిటీలో కిర్క్‌ను ఓ ఆగంతకుడు కాల్చి చంపాడు. క్యాంపస్‌లోని సోరెన్సెన్ సెంటర్ ప్రాంగణంలో నిర్వహించిన డిబేట్ సమయంలో హత్యకు గురయ్యారు. మరణానంతరం ట్రంప్ కిర్క్‌కి ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Gold Alert: అలర్ట్.. పసిడి మెరుగులు పైపైనేనా.. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయండి
Also Read
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్‌హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
పెంటగాన్‌లో జరిగిన 9/11 స్మారక కార్యక్రమంలో మాట్లాడుతూ, ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఆయనకు ఈ మెడల్ ప్రధానం చేయడానికి సంతోషిస్తున్నట్లు చెప్పారు. చార్లీని తామంతా మిస్ అవుతున్నామని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. కిర్క్‌పై దాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఆయను గ్రేట్ లెజెండరీ అని ప్రశంసించారు. యూఎస్ ఎన్నికల సమయంలో ట్రంప్‌కు గట్టి మద్దతుదారుగా చార్లీ కిర్క్ ఉన్నారు. ట్రంప్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు.
ఇదిలా ఉంటే, ఈ హత్యపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. కాలేజ్ పైకప్పు నుంచి దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటకే కిర్క్‌పై దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హంతకుడు హైపవర్ రైఫిల్ వాడినట్లు కనుగొన్నారు. అనుమానిత హంతకుడు కాలేజీ వయసు ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడని ఊటీ డీపీఎస్ కమిషనర్ బ్యూ మాసన్ చెప్పారు. బుధవారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరికి కాల్పులతో సంబంధం లేదని నిర్ధారణ అయింది. అసలు నిందితుడి కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..