Site icon NTV Telugu

Trump: చైనాతో వ్యాపారం చేశారో చచ్చారే.. కెనడాకు ట్రంప్ ‘‘టారిఫ్’’ వార్నింగ్..

Trump

Trump

Trump: కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందంపై ముందుకు వెళ్తే, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఉద్రిక్తత పెరిగితే, అన్ని కెనడా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం హెచ్చరించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన కెనడా ప్రధాని మార్క్ కార్నీని టార్గెట్ చేస్తూ.. కెనడాను అమెరికాలోకి చైనా వస్తువుల్ని రవాణా చేసే మార్గంగా మార్చనివ్వబోమని అన్నారు. ‘‘గవర్నర్ కార్నీ కెనడాను డ్రాప్ ఆఫ్ పోర్ట్‌గా మార్చబోతున్నారని భావిస్తే, అతను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాడు’’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.

Read Also: T20 World Cup: పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తుందా? పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ స్పందన..

కెనడా ఆర్థిక వ్యవస్థ, సమాజానికి చైనా ప్రాథమిక ముప్పుగా ఉందని, బీజింగ్ కెనడాను సజీవంగా తినేస్తుందని, దానిని పూర్తిగా మ్రింగేస్తుందని ట్రంప్ ఆరోపించారు. చైనాతో ఏదైనా ఒప్పందం తక్షణ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కెనడా చైనాతో ఒప్పందం చేసుకుంటే వెంటనే 100 సుంకంతో దెబ్బతీస్తామని చెప్పారు. ఇటీవల ,కెనడా ప్రధాన కార్నీ చైనా పర్యటనకు వెళ్లి వచ్చారు. దీని తర్వాత ట్రంప్ కెనడాపై విరుచుకుపడుతున్నారు. గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా గోలెడ్ డోమ్ క్షిపణి రక్షణ ప్రాజెక్టును వ్యతిరేకించడం ద్వారా కెనడా యూఎస్ భద్రతను దెబ్బతీస్తోందని ట్రంప్ అన్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

Exit mobile version