Site icon NTV Telugu

Trump: భారత్‌, చైనాపై 100 శాతం సుంకం విధించండి.. ఈయూకు ట్రంప్ సూచన

Trump5

Trump5

రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ పూనుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకునేందుకు పుతిన్ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అధిక ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్, చైనా 100 శాతం సుంకం విధించాలని యూరోపియన్ దేశాలకు ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Delhi: షోరూమ్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లో నిమ్మకాయ తొక్కిస్తుండగా కిందపడ్డ ఖరీదైన కారు.. ఆ తర్వాత ఏమైందంటే..!

ఓ వైపు శాంతి ఒప్పందాలు జరుగుతుంటుండగానే ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. వైమానిక, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇది ట్రంప్‌కు మరింత అసహనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశ అధికారులు వైట్‌హౌస్‌లో కలిశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చర్చించారు. రష్యా దిగి రావాలంటే చైనా, భారత్‌పై ఒత్తిడి పెంచాలని.. 100 శాతం సుంకం విధించాలని పాశ్చాత్య దేశాధికారులకు ట్రంప్ సూచించారు. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: T20 World Cup 2026: ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్‌.. అహ్మదాబాద్‌లో ఫైనల్..?

అయితే ట్రంప్ సలహా మేరకు భారత్, చైనా 100 శాతం సుంకం అమలు చేసేందుకు ఈయూ అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్రంప్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉక్రెయిన్‌లో త్వరగా శాంతి నెలకొల్పడానికి ఇదే మార్గం అని ఈయూ దేశాలు భావిస్తున్నాయి. ఇక ఆంక్షలు విధిస్తే ఎదుకయ్యే తదుపరి పరిణామాలపై కూడా ఈయూ అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ కీలక పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ మంచి స్నేహితుడని.. మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య వాణిజ్యం పరస్పరం సహకరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. ట్రంప్ పోస్ట్‌కు మోడీ కూడా రిప్లై ఇచ్చారు. తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోడీ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ట్రంప్ మొదటి పరిపాలనలో మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక కొద్ది రోజులు మోడీ-ట్రంప్ మధ్య మంచి సంబంధాలే కొనసాగాయి. అయితే తొలుత భారత్‌పై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అనంతరం కొద్దిరోజులకే రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు బాంబ్ పేల్చారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. అంటే అన్ని దేశాల కంటే భారత్‌పైనే ఎక్కువ సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక రష్యా దగ్గరే చమురు కొనుగోలు చేస్తామని భారత్ తేల్చి చెప్పింది. ఇక అన్నదాతల కోసం సుంకాలు ఎంతైనా భరిస్తామంటూ ప్రకటించారు.

Exit mobile version