అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్య తీవ్ర వివాదాస్పదమవుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మోనార్క్‌లా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఎలాన్ మస్క్ దూరం అయ్యారు. అదే కోవలో పలువురు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Pre Wedding Shoot: ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు వద్దు.. కరపత్రం వైరల్! మీరు కూడా ఓసారి ఆలోచించండి
భారత్ మంచి స్నేహితుడు అంటూనే భారీగా సుంకాలు విధించారు. తాజాగా విధించిన సుంకాల కారణంగా భారత్ కూడా దూరంగా ఉంటుంది. పదే పదే భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చెబుతుండడం కూడా భారత్‌కు రుచించడం లేదు. పలుమార్లు ట్రంప్ వాదనను భారత్ ఖండించింది. ఇలా ప్రతి దేశంతో ఏదో విధంగా కయ్యం పెట్టుకునేలా ట్రంప్ వ్యవహరించడం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: భారతీయుడెవరో నిర్ణయించేది మీరు కాదు.. న్యాయమూర్తుల తీరుపై ప్రియాంకాగాంధీ అసహనం
ఇలాంటి తరుణంలో ట్రంప్ కుమారుడు ధరించిన టీ షర్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెలానియా-డొనాల్డ్ ట్రంప్ మధ్యలో కుమారుడు ఉన్నాడు. కుమారుడు ధరించిన టీ షర్ట్‌పై రాసిన రాతలు వైరల్‌గా మారాయి. టీ షర్ట్ ముందు భాగంలో ‘‘ఐ యామ్ విత్ స్టూపిడ్’’ అని రాసుంది. ఈ వ్యాఖ్యల కింద థంబ్ సింబల్ ఉంది. ఈ థంబ్ సింబల్ ట్రంప్ వైపు చూపిస్తోంది. దీంతో ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
