Site icon NTV Telugu

US: అమెరికాలో ముగిసిన షట్‌డౌన్‌.. బిల్లుపై ట్రంప్ సంతకం

Trump

Trump

అమెరికాలో ఎట్టకేలకు సుదీర్ఘ షట్‌డౌన్ ముగిసింది. ఈ మేరకు 222-209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించింది. షట్‌డౌన్‌ను ముగించే ప్రభుత్వ ఫండింగ్‌ బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం రాత్రి సంతకం చేశారు. దీంతో 43 రోజుల సుదీర్ఘ షట్‌డౌన్‌కు అధికారికంగా ముగింపు లభించింది.

ఇది కూడా చదవండి: Al-Falah University: వామ్మో.. వైస్ ఛాన్సలర్‌ది కూడా చీకటి బాగోతమే.. హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం ఆర్థిక ‘షట్‌డౌన్‌’ కొనసాగింది. షట్‌డౌన్ కారణంగా ఉద్యోగులు, కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీతాలు లేక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యారు. ఇక విమానాశ్రయాల్లో కూడా అనేక మంది ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. ఇక ఫుడ్‌ సెంటర్ల దగ్గరైతే పెద్ద క్యూ లైన్లు చోటుచేసుకున్నాయి. ఇలా అన్ని వర్గాల వారు షట్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Delhi Car Blast: వెలుగులోకి మరో వీడియో.. ట్రాఫిక్‌లో ఉండగా ఏం జరిగిందంటే..!

ఇక బిల్లుపై సంతకం చేసే ముందు ట్రంప్ మాట్లాడారు. ‘‘ఈరోజు మనం ఎప్పటికీ దోపిడీకి లొంగబోమని స్పష్టమైన సందేశం పంపుతున్నాం.’’ అని తెలిపారు. ఇక అంతకుముందు ప్రతినిధుల సభలో 222-209 తేడాతో బిల్లుకు ఆమోదం లభించింది. షట్‌డౌన్ ముగియడంతో ఉద్యోగులు తమ విధుల్లో చేరనున్నారు.

Exit mobile version