US: హౌతీలపై జరిపిన దాడి వీడియోను పంచుకున్న ట్రంప్
- యెమెన్‌లో అమెరికా దాడులు
- హౌతీలపై జరిపిన దాడి వీడియోను పంచుకున్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా యెమెన్‌లో హౌతీ ఉగ్రవాదులపై అమెరికా భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే పదుల కొద్దీ హౌతీలు మరణించారు. తాజాగా అమెరికా మరో భీకర దాడి చేసింది. డజన్ల కొద్దీ హౌతీ ఉగ్రవాదులు మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేశారు. ‘అయ్యో’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘అయ్యో, ఈ హౌతీలు దాడి చేయరు’, ‘‘వాళ్లు మళ్లీ మన ఓడలను ముంచివేయరు!.’’ అంటూ ట్రంప్ రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Rashmika : రష్మిక మందన్న బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు అటెండ్ అయ్యారు?
Also Read
- Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
- Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
- Iran Oman Strait of Hormuz Deal: హార్ముజ్ జలసంధి మాదే.. ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. ట్రంప్ హెచ్చరికలకు స్ట్రాంగ్ కౌంటర్
ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలు లక్ష్యంగా హౌతీ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఇరాన్ మద్దతుతో ఈ హౌతీలు చెలరేగిపోతున్నారు. ఈ దాడులు అమెరికా వ్యాపారాలను భారీగా దెబ్బతీస్తున్నాయి. దీంతో అగ్రరాజ్యం ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా హౌతీలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. అయితే ఒక చోట హౌతీలంతా సమావేశమై చర్చించుకుంటుండగా అమెరికా భీకరమైన బాంబ్‌ను ప్రయోగించింది. అంతే ఒక్కసారిగా భారీ విస్ఫోటనం జరిగింది. ఆ ప్రదేశంలో పెద్ద గుంత ఏర్పడింది. అంతేకాకుండా వాళ్ల శరీరాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విమానాల నుంచి తీసిన వీడియోలో.. ఆ సమీపంలో వాహనాలు నిలిపి ఉంచినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ హౌతీలంతా.. దాడులు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా సమాచారం. ఇంతలోనే ఊహించని దాడి జరగడంతో హతమయ్యారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay-TTD: టీటీడీ ఛైర్మన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
ఇక దాడి జరగగానే పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. అంతేకాకుండా ఘటనాస్థలిలో భారీ గుంత ఏర్పడింది. వీడియోలో ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తోంది. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకారంగా ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై హౌతీలు దాడి చేస్తు్న్నారు. అంతే ధీటుగా అమెరికా ప్రతీకారం తీర్చుకుంది.
These Houthis gathered for instructions on an attack. Oops, there will be no attack by these Houthis!
They will never sink our ships again! pic.twitter.com/lEzfyDgWP5
— Donald J. Trump (@realDonaldTrump) April 4, 2025
తాజావార్తలు
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
-
Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
-
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?