Site icon NTV Telugu

Trmup: యూరోపియన్ దేశాలపై ఆగ్రహం.. జెలెన్‌స్కీకి కొత్త డెడ్‌లైన్ విధించిన ట్రంప్!

Trump2

Trump2

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ముందడుగు పడడం లేదు. ఇటీవల 28 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ముందుకు తీసుకొచ్చారు. ఇక ట్రంప్ బృందం రంగంలోకి దిగి ఇరు దేశాలతో చర్చించారు. రష్యా పూర్తి అనుకూలంగా ఉంటే.. ఉక్రెయిన్‌ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రష్యా రూపొందించిన ప్రణాళిక అంటూ జెలెన్‌స్కీ తోసిపుచ్చారు.

ఇది కూడా చదవండి: IndiGo: ప్రయాణీకులను ఏడిపించినందుకు ఇండిగోకు భారీ శిక్ష!

ఇదిలా ఉంటే తాజాగా యూరోపియన్ దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ దేశాల తీరు కారణంగానే శాంతి ఒప్పందం ముందుకు సాగడం లేదని మిత్రదేశాలపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. అయితే తాజాగా జెలెన్‌స్కీకి ట్రంప్ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ సమయానికి శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలని జెలెన్‌స్కీపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన..

Exit mobile version