అణు పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందని ట్రంప్ ప్రకటించారు. ఆదివారం సీబీఎస్ న్యూస్‌తో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. అణు పరీక్షలపై అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానం ఇస్తూ.. అన్ని దేశాలు అణు పరీక్షలు చేస్తు్న్నాయని.. ప్రపంచ ధోరణిని బట్టి అమెరికా కూడా అణు పరీక్షలు చేయాల్సి వస్తుందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో మూడు దశాబ్దాల తర్వాత అమెరికా అణు పరీక్షలు చేయడానికి సిద్ధపడుతోంది. ఇక ట్రంప్ ప్రకటనపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: తమిళనాడులో మరో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌తో సహా అనేక దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని.. అమెరికా మాత్రమే అలా చేయని ఏకైక దేశంగా మిగిలిపోయిందని అన్నారు. ప్రపంచ ధోరణి ప్రకారమే అమెరికా ముందుకు వెళ్తోందని చెప్పుకొచ్చారు. రష్యా, చైనా గురించి బయట సమాజానికి తెలియదు.. అమెరికా గురించి మాత్రం బహిరంగంగా తెలిసిపోతుందని వివరించారు. అణు పరీక్షలు గురించి రాసే విలేకర్లు రష్యా, చైనా దగ్గర లేరని.. అమెరికాలో మాత్రం ఆ స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. ఇటీవల రష్యా పోసిడాన్ నీటి అడుగున డ్రోన్‌తో సహా అధునాతన అణ్వాయుధ సామర్థ్యాన్ని పరీక్షించిందని తెలిపారు. ఉత్తర కొరియా అయితే నిరంతరం అణు పరీక్షలు చేస్తూనే ఉందని చెప్పారు. ఇతర దేశాలు కూడా అలానే చేస్తున్నాయని.. అమెరికా మాత్రమే ఎందుకు పరీక్షించకూడదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఏఐ శక్తిని ఉపయోగకరంగా మారుస్తాం.. అభివృద్ధిలో లక్ష్యాన్ని ఛేదిస్తామన్న మోడీ
అన్ని దేశాల కంటే అమెరికా దగ్గరనే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని తెలిపారు. పుతిన్, జిన్‌పింగ్‌తో అణ్వాయుధ నిరాయుధీకరణ గురించి చర్చించినట్లు చెప్పారు. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చే అణ్వాయుధాలు అమెరికా దగ్గర ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా దగ్గర భారీగానే అణ్వాయుధాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. అనంతరం మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. మే 10న ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది. అయితే ఆ సమయంలో పాకిస్థాన్ అణు దాడులకు పాల్పడొచ్చని చర్చ జరిగింది. తాజాగా ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ అణు పరీక్షలు చేస్తుందంటూ మాట్లాడారు. దీనిపై భారతదేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.
BREAKING🚨: US President Donald Trump says “Pakistan’s been testing nuclear weapons.”
📺 Video courtesy: CBS pic.twitter.com/73BJcqFcuu
— AsiaWarZone (@AsiaWarZone) November 3, 2025
